Hyderabad: గచ్చిబౌలి: 6వ అంతస్తు నుంచి పడి రియల్టర్ మృతి!

Hyderabad: గచ్చిబౌలి అంజయ్య నగర్‌లోని ఓ పీజీ భవనం 6వ అంతస్తు నుంచి కిందపడి ప్రకాశం జిల్లాకు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి తల్లూరి సుబ్బారావు మృతి చెందాడు.

VISHWANATH, SHERILINGAMPALLY
Published on: 17 Aug 2026 5:13 PM IST
Hyderabad
X

Hyderabad: గచ్చిబౌలి: 6వ అంతస్తు నుంచి పడి రియల్టర్ మృతి!

హైదరాబాద్: రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలోని అంజయ్య నగర్‌లో సోమవారం విషాదకర సంఘటన చోటుచేసుకుంది. 6వ అంతస్తు నుంచి కిందపడి ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి అక్కడికక్కడే మృతి చెందాడు.

పోలీసుల వివరాల ప్రకారం... ప్రకాశం జిల్లా కనిగిరి ప్రాంతానికి చెందిన తల్లూరి సుబ్బారావు (38, తండ్రి: వెంకటేశ్వర్లు) రియల్ ఎస్టేట్ బ్రోకర్‌గా పనిచేస్తున్నాడు. ప్రస్తుతం గచ్చిబౌలి, అంజయ్య నగర్‌లోని 'కింగ్స్ లాఫ్ట్' పీజీ (PG)లో నివాసముంటున్నాడు. సోమవారం (17-08-2026) ఉదయం 10:30 గంటల ప్రాంతంలో అతను పీజీ భవనం 6వ అంతస్తు పైనుంచి కిందపడిపోయాడు.

ఈ ప్రమాదంలో తల, కుడిచేతికి తీవ్ర గాయాలు కావడంతో సుబ్బారావు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. సమాచారం అందుకున్న రాయదుర్గం పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. ప్రమాదవశాత్తు జారిపడ్డాడా లేదా ఇతర కారణాలేమైనా ఉన్నాయా అనే కోణంలో కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఇన్స్పెక్టర్ భూపతి తెలిపారు.

VISHWANATH, SHERILINGAMPALLY

VISHWANATH, SHERILINGAMPALLY

Next Story