Pargi: పరిగిలో తీన్మార్ మల్లన్నపై రెడ్డి సంఘం ఫిర్యాదు!

Pargi: రెడ్డి సామాజిక వర్గాన్ని కించపరిచేలా అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నపై వికారాబాద్ జిల్లా పరిగి పోలీస్ స్టేషన్‌లో రెడ్డి సంఘం నాయకులు ఫిర్యాదు చేశారు.

WAZID, PARIGI
Published on: 10 Sept 2026 7:49 PM IST
Pargi
X

Pargi: పరిగిలో తీన్మార్ మల్లన్నపై రెడ్డి సంఘం ఫిర్యాదు!

PARGI: వికారాబాద్ జిల్లా పరిగి పోలీస్ స్టేషన్‌లో తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్‌పై రెడ్డి సంఘం ఆధ్వర్యంలో ఫిర్యాదు చేశారు.సామాజిక మాధ్యమాలు, బహిరంగ సభల్లో రెడ్డి సామాజిక వర్గాన్ని ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని ఫిర్యాదు దారులు ఆరోపించారు.

గతంలో కూడా పలుమార్లు రెడ్లను ఉద్దేశించి అసభ్యకరంగా మాట్లాడారని, తాజాగా రెడ్లకు నీతి లేదు, జాతి లేదు అంటూ వ్యాఖ్యలు చేశారని వారు పేర్కొన్నారు.కులం లేదా సామాజిక వర్గాన్ని కించపరిచేలా బహిరంగంగా వ్యాఖ్యలు చేయడం సమంజసం కాదని రెడ్డి సంఘం నాయకులు అన్నారు.

ఇలాంటి వ్యాఖ్యలు చేసినందుకు తీన్మార్ మల్లన్నను ఎమ్మెల్సీ పదవికి అనర్హుడిగా ప్రకటించాలని, పదవి నుంచి తొలగించాలని వారు డిమాండ్ చేశారు.అలాగే, ఆయనపై చట్టపరమైన చర్యలు తీసుకుని కేసు నమోదు చేయాలని పరిగి పోలీసులను కోరారు.

WAZID, PARIGI

WAZID, PARIGI