Hyderabad: ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు విడుదల చేయాలి: VJS
Hyderabad: తెలంగాణలో పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఓయూ ఆర్ట్స్ కాలేజీ వద్ద విద్యార్థి జన సమితి నిరసన చేపట్టింది.
Hyderabad: ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు విడుదల చేయాలి: VJS
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను ప్రభుత్వం తక్షణమే విడుదల చేయాలని విద్యార్థి జన సమితి (వీజేఎస్) డిమాండ్ చేసింది. ఈ మేరకు శనివారం ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీ వద్ద ప్లకార్డులతో నిరసన కార్యక్రమం నిర్వహించింది. విద్యార్థి జన సమితి రాష్ట్ర అధ్యక్షుడు మాసంపల్లి అరుణ్‌కుమార్ ఆదేశాల మేరకు ఓయూ అధ్యక్షుడు చెరుకు శివరాజ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టారు.
ఈ సందర్భంగా శివరాజ్ మాట్లాడుతూ.. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు విడుదల కాకపోవడంతో లక్షలాది మంది విద్యార్థులు, వారి కుటుంబాలు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. బకాయిల కారణంగా విద్యార్థుల ఉన్నత విద్యకు ఆటంకాలు కలగకుండా ప్రభుత్వం తక్షణమే స్పందించాలని కోరారు.
పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులను వెంటనే విడుదల చేయడంతో పాటు, భవిష్యత్తులో బకాయిలు పేరుకుపోకుండా నిర్ణీత గడువులో నిధులు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. విద్యార్థుల విద్యా హక్కుల పరిరక్షణ కోసం విద్యార్థి జన సమితి నిరంతరం పోరాటం కొనసాగిస్తుందని చెరుకు శివరాజ్ స్పష్టం చేశారు.




