Medchal: కామ్రేడ్ లెనిన్ జయంతి.. స్ఫూర్తిని చాటిన మేడ్చల్ కమ్యూనిస్టులు!

Medchal: మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కమలానగర్‌లో కామ్రేడ్ వీ.ఐ. లెనిన్ 156వ జయంతిని పురస్కరించుకుని సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో నివాళులర్పించారు.

ASHOK, KAPRA
Published on: 22 April 2026 3:29 PM IST
Medchal
X

Medchal: కామ్రేడ్ లెనిన్ జయంతి.. స్ఫూర్తిని చాటిన మేడ్చల్ కమ్యూనిస్టులు!

Medchal: భారత కమ్యూనిస్టు పార్టీ మార్క్సిస్టు మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఆధ్వర్యంలో కమలానగర్ ఆఫీసులో ప్రపంచ కమ్యూనిస్టు యోధుడు కామ్రేడ్ వి ఐ లెనిన్ 156వ జయంతి సందర్భంగా సంస్మరణ కార్యక్రమం జరిగింది. పార్టీ సీనియర్ నాయకులు గొడుగు యాదగిరిరావు అధ్యక్షత వహించారు. పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కోమటి రవి , పార్టీ సీనియర్ నాయకురాలు శారద లెనిన్ చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. పీపుల్స్ వెల్ఫేర్ ట్రస్ట్ బాధ్యులు సిహెచ్ ప్రసాద్ మాట్లాడుతూ కామ్రేడ్ లెనిన్ మార్క్సిస్టు మహాపాధ్యాయుడని అన్నారు. కార్ల్ మార్క్స్ రూపొందించిన మార్క్సిజాన్ని పరిపుష్టం చేసి పెట్టుబడిదారీ విధానాలు అత్యున్నత దశ సామ్రాజ్యవాదం అని సూత్రీకరణ చేసి ఒక దేశంలో సోషలిజం నిర్మించవచ్చునని రుజువు పరిచారు అని చెప్పారు.

లెనిన్ రూపొందించిన సిద్ధాంతం కమ్యూనిస్టు సమాజం అభివృద్ధి అభివృద్ధి అయ్యి విస్తరించడానికి ఉపయోగపడిందని చెప్పారు. కోమటి రవి గారు మాట్లాడుతూ మార్క్సిజం, లెనినిజం సజీవ సిద్ధాంతాలని సమాజం మార్పు కోసం పోరాటాలను ముందుకు నడిపిన గొప్ప మేధావి అని చెప్పారు. అనేక నిర్బంధాలకు ఎదురొడ్డి నిలబడ్డారు.సోవియట్ యూనియన్ స్థాపించడం దాన్ని అజేయంగా నిలపడంలో ఆయన ఎంతో కృషి చేశారని చెప్పారు. లెనిన్ రూపొందించిన సిద్ధాంతం భారతదేశానికి అన్వయించుకుని పోరాటాలు ఉధృతం చేయాలని చెప్పారు. అనంతరం సభ్యులందరూ చిత్రపటానికి పూలను వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో కేకే ఉన్నికృష్ణన్, ఎన్ శ్రీనివాస్, సుధీర్, సోమయ్య, వెంకటేశ్వరరావు, సిహెచ్ ప్రసాద్, రుక్కయ్య, శారద, రవి, శ్రీమన్నారాయణ తదితరులు పాల్గొన్నారు.

ASHOK, KAPRA

ASHOK, KAPRA

Next Story