Ghatkesar: ఘట్‌కేసర్‌లో నీటి కష్టాలు.. అధికారులకు బీఆర్ఎస్ హెచ్చరిక!
Ghatkesar: ఘట్‌కేసర్ 6వ డివిజన్‌లో తాగునీటి సమస్యపై బీఆర్ఎస్ నిరసన.
Ghatkesar: ఘట్‌కేసర్‌లో నీటి కష్టాలు.. అధికారులకు బీఆర్ఎస్ హెచ్చరిక!
ఘట్ కేసర్: మల్కాజిగిరి నగరపాలక సంస్థ పరిధిలోని ఘట్ కేసర్ మున్సిపల్ సర్కిల్ 6వ డివిజన్ లో నెలకొన్న తీవ్రమైన తాగునీటి సమస్యను తక్షణమే పరిష్కరించాలని కోరుతూ భారత రాష్ట్ర సమితి నాయకులు సోమవారం ప్రజావాణిలో అధికారులకు వినతిపత్రం సమర్పించారు. ఘట్ కేసర్ మున్సిపల్ సర్కిల్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా ఘట్ కేసర్ పట్టణ బీఆర్ఎస్ అధ్యక్షుడు బండారి శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో బిఆర్ఎస్ నాయకులు డిప్యూటీ కమిషనర్ వాణి ని కలిసి, వేసవి తీవ్రత కారణంగా 6వ డివిజన్ లో తాగునీటి కోసం ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వారు వివరించారు.
సమస్యను అత్యవసరంగా పరిష్కరించేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా బండారి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తాగునీటి సమస్యను సమర్థవంతంగా నియంత్రించామని, ప్రస్తుతం అధికారుల నిర్లక్ష్యం వల్ల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని విమర్శించారు. ప్రజా సమస్యల పట్ల నిర్లక్ష్యం కొనసాగితే ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్లు, మాజీ ఎంపీటీసీలు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, పాల్గొన్నారు.




