Hyderabad: జూబ్లీహిల్స్‌లో రిటైర్డ్ ఐపీఎస్ అధికారి భార్య హత్య
Hyderabad: జూబ్లీహిల్స్‌లో రిటైర్డ్ ఐపీఎస్ అధికారి వినయ్ రంజన్ భార్య హత్య కలకలం రేపింది. పనిమనిషి కల్పనపై పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
Hyderabad
Hyderabad: హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ప్రశాసన్ నగర్‌లో నివాసం ఉంటున్న రిటైర్డ్ ఐపీఎస్ అధికారి వినయ్ రంజన్ భార్య హత్యకు గురయ్యారు. ఈ ఘటనలో ఇంటి పనిమనిషి కల్పన ప్రమేయం ఉన్నట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు.
ఘటన అనంతరం ఇంట్లో ఉన్న నగదు, బంగారం మాయమైనట్లు అధికారులు వెల్లడించారు. సమాచారం అందుకున్న వెంటనే సీపీ సజ్జనార్, షికా గోయల్, అడిషనల్ సీపీ శ్రీనివాస్, టాస్క్‌ఫోర్స్ డీసీపీ వైభవ్ గైక్వాడ్ తదితర ఉన్నతాధికారులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు.
క్లోస్ టీమ్, డాగ్ స్క్వాడ్ సిబ్బంది ఆధారాలు సేకరిస్తుండగా, పరిసర ప్రాంతాల సీసీ కెమెరా ఫుటేజ్‌ను పోలీసులు పరిశీలిస్తున్నారు. గత కొన్ని రోజులుగా ఇంట్లో నమ్మకంగా పనిచేసిన కల్పన అదును చూసి ఈ దారుణానికి పాల్పడిందా అనే కోణంలో దర్యాప్తు కొనసాగుతోంది.
అలాగే, ఈ ఘటనలో మరెవరైనా ప్రమేయం ఉందా? నేపాలి గ్యాంగ్‌కు సంబంధాలు ఉన్నాయా? అనే కోణాల్లో కూడా పోలీసులు విచారణ చేపట్టారు.




