Shamshabad: హైదర్ షాకోట్‌లో ఘోర ప్రమాదం రిటైర్డ్ ఆర్మీ జవాన్ బలి
Shamshabad: హైదర్ షాకోట్‌లో ఘోర రోడ్డు ప్రమాదం: అతివేగంగా వచ్చిన కారు ఢీకొని రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగి మృతి, మరో ఇద్దరికి తీవ్ర గాయాలు.
Shamshabad: హైదర్ షాకోట్‌లో ఘోర ప్రమాదం రిటైర్డ్ ఆర్మీ జవాన్ బలి
శంషాబాద్: గ్రేటర్ హైదరాబాద్ గండిపేట మండలం హైదర్ షాకోట్‌లో హిట్ అండ్ రన్.. ఒకరి మృతి మరో ఇద్దరికి తీవ్ర గాయాలు.
ప్రమాదానికి కారణమైన కారును అక్కడే వదిలేసే పరారైన కారులోని వ్యక్తులు.
హైదర్ షాకోట్‌లోని ఎస్‌ఎంపీ స్కూల్ సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగి మృతి చెందగా,
మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.
స్థానికుల వివరాల ప్రకారం, అతివేగంగా వచ్చిన మహేంద్ర suv 350 కారు రోడ్డుపై వెళ్తున్న హైదర్ షాకోట్‌కు చెందిన రిటైర్డ్ ఆర్మీ వ్యక్తిని బలంగా ఢీకొట్టింది.
ఢీకొట్టిన ప్రభావంతో ఆయన గాల్లోకి ఎగిరి కిందపడటంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలిపారు.
అదే సమయంలో రాపిడో బైక్‌పై వెళ్తున్న ఇద్దరినీ కారు ఢీకొట్టడంతో వారికి గాయాలయ్యాయి.
వారిలో ఒకరి కాలు విరిగినట్లు సమాచారం. గాయపడిన వారిని చికిత్స కోసం ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు.
ప్రమాదం జరిగిన వెంటనే కారులో ఉన్న నలుగురు యువకులు వాహనాన్ని అక్కడే వదిలి పరారైనట్లు స్థానికులు చెబుతున్నారు.
పోలీసులు కారు నంబర్ ఆధారంగా వివరాలు సేకరించగా, అది శంషాబాద్‌కు చెందిన వాహనంగా గుర్తించినట్లు సమాచారం.
హైదర్ షాకోట్ నుంచి అతివేగంగా వస్తున్న కారును చూసి రోడ్డుపై ప్రయాణిస్తున్నవారు భయాందోళనకు గురయ్యారు.
కారులో ఉన్నవారు మద్యం మత్తులో ఉండి ఉండొచ్చని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
సమాచారం అందుకున్న నార్సింగి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
మద్యం మత్తు కారణంగానే ప్రమాదం జరిగి ఉండొచ్చని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.




