Hyderabad: డీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడిగా రిటైర్డ్ ప్రొఫెసర్ పీయూబీ శర్మ నియామకం!

Hyderabad: దక్షిణ జనతా పార్టీ (DJP) జాతీయ ఉపాధ్యక్షుడిగా హెచ్‌సీయూ రిటైర్డ్ ప్రొఫెసర్ పీయూబీ శర్మ నియామకమయ్యారు.

HARISH, TARNAKA
Published on: 30 Aug 2026 10:24 PM IST
Hyderabad
X

Hyderabad: డీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడిగా రిటైర్డ్ ప్రొఫెసర్ పీయూబీ శర్మ నియామకం!

హైదరాబాద్: దక్షిణ జనతా పార్టీ (డీజేపీ) జాతీయ ఉపాధ్యక్షుడిగా హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం రిటైర్డ్ ప్రొఫెసర్ పీయూబీ శర్మను నియమించినట్లు ఆ పార్టీ జాతీయ కోఆర్డినేటర్ ప్రొఫెసర్ డాక్టర్ గాలి వినోద్ కుమార్ తెలిపారు. ఆదివారం ఓయూ ఆర్ట్స్ కళాశాల ఆవరణలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయనకు నియామక పత్రం అందజేశారు.

కర్ణాటక కోఆర్డినేటర్‌గా అభి ద్రావిడను, తమిళనాడు కోఆర్డినేటర్‌గా సుగురు తులహప్పన్‌ను నియమించినట్లు ప్రకటించారు. దక్షిణాది హక్కుల పరిరక్షణ, రాష్ట్రాల స్వయం ప్రతిపత్తి కోసం డీజేపీ పోరాటం చేస్తుందని గాలి వినోద్ కుమార్ తెలిపారు. హైదరాబాద్‌ను దేశ రెండో రాజధానిగా ఏర్పాటు చేయాలని, దక్షిణాదిలో సుప్రీంకోర్టు బెంచ్, ప్రత్యేక పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

నీట్, ఎన్‌టీఏ పరీక్షా విధానాన్ని రద్దు చేసి దక్షిణాది రాష్ట్రాలకు కేంద్రంలో తగిన ప్రాధాన్యత, నిధులు కేటాయించాలని ఈ సందర్భంగా కోరారు. ఈ కార్యక్రమంలో డీజేపీ జాతీయ కమిటీ సభ్యులు అలిగె జీవన్, బోయ శంకర్ తదితరులు పాల్గొన్నారు.

HARISH, TARNAKA

HARISH, TARNAKA

Next Story