Medchal: జవహర్‌నగర్‌లో అక్రమ నిర్మాణాల కూల్చివేత: కాప్రా రెవెన్యూ శాఖ యాక్షన్!

Medchal: మేడ్చల్ జిల్లా కాప్రా పరిధిలోని జవహర్‌నగర్‌లో ప్రభుత్వ భూముల్లో వెలిసిన అక్రమ నిర్మాణాలను రెవెన్యూ అధికారులు కూల్చివేశారు.

PURENDAR, ALWAL
Published on: 10 Sept 2026 8:20 PM IST
Medchal
X

Medchal: జవహర్‌నగర్‌లో అక్రమ నిర్మాణాల కూల్చివేత: కాప్రా రెవెన్యూ శాఖ యాక్షన్!

Medchal: జవహర్‌నగర్ ప్రాంతంలోని ప్రభుత్వ భూముల్లో అక్రమంగా నిర్మాణాలు చేపడితే ఎంతమాత్రం సహించేది లేదని కాప్రా తహసీల్దార్ మతిన్ హెచ్చరించారు.

కాప్రా మండల పరిధిలోని జవహర్‌నగర్ ప్రాంతంలో ప్రభుత్వ భూముల్లో అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయనే సమాచారం మేరకు తహసీల్దార్ మతిన్ ఆదేశాలతో గురువారం రెవెన్యూ అధికారులు చర్యలు చేపట్టారు. గిర్దావర్ సత్యనారాయణ సమక్షంలో సర్వే నంబర్లు 44, 381, 420 పరిధిలోని మల్కారం, సంతోష్‌నగర్ ప్రాంతాల్లో వెలిసిన పలు అక్రమ నిర్మాణాలను జేసీబీ సహాయంతో కూల్చివేశారు.

ఈ సందర్భంగా తహసీల్దార్ మతిన్ మాట్లాడుతూ జవహర్‌నగర్ పరిధిలోని ప్రభుత్వ భూముల్లో ఎలాంటి అక్రమ నిర్మాణాలు చేపట్టవద్దని సూచించారు. ప్రభుత్వ భూములను ఆక్రమించి నిర్మాణాలు చేపట్టే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

ప్రభుత్వ భూములను అమాయక పేదలకు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్న అక్రమార్కులపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామని, అలాంటి వారిపై త్వరలోనే చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రభుత్వ భూముల పరిరక్షణే లక్ష్యంగా రెవెన్యూ శాఖ ముందుకు సాగుతోందని పేర్కొన్నారు.

జవహర్‌నగర్ ప్రాంతంలోని ప్రభుత్వ భూముల్లో ఎవరూ అక్రమంగా నిర్మాణాలు చేపట్టవద్దని, ప్రభుత్వ భూముల విషయంలో నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తహసీల్దార్ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.

PURENDAR, ALWAL

PURENDAR, ALWAL