Uppal: రింగ్ రోడ్డులో ట్రాఫిక్ మళ్లింపులపై జోనల్ కమిషనర్ పరిశీలన

Uppal: ఉప్పల్–నారపల్లి ఫ్లైఓవర్ నిర్మాణ పనుల నేపథ్యంలో ఉప్పల్ రింగ్ రోడ్డు వద్ద అమలు చేస్తున్న ట్రాఫిక్ మళ్లింపులను జోనల్ కమిషనర్ రాధికా గుప్తా పరిశీలించారు.

KARUNAKAR, UPPAL
Published on: 19 May 2026 8:33 AM IST
Uppal
X

Uppal: రింగ్ రోడ్డులో ట్రాఫిక్ మళ్లింపులపై జోనల్ కమిషనర్ పరిశీలన

ఉప్పల్: ఉప్పల్ జోన్ జోనల్ కమిషనర్ రాధికా గుప్తా సోమవారం ఉప్పల్ రింగ్ రోడ్డు వద్ద జరుగుతున్న ఉప్పల్–నారపల్లి కారిడార్ ఫ్లైఓవర్ నిర్మాణ పనుల నేపథ్యంలో అమలు చేస్తున్న ట్రాఫిక్ మళ్లింపు ఏర్పాట్లను ప్రత్యక్షంగా పరిశీలించారు. ఫ్లైఓవర్ నిర్మాణ పనుల కారణంగా సుమారు మూడు నెలల పాటు ట్రాఫిక్ డైవర్షన్ అమల్లో ఉండనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా ఎస్‌ఆర్‌డీపీ ఈఈ, ఉప్పల్ ఎస్‌ఈ మరియు వాటర్ వర్క్స్ శాఖ అధికారులతో కలిసి కమిషనర్ ట్రాఫిక్ నియంత్రణ చర్యలు, ప్రజలకు కలుగుతున్న ఇబ్బందులు, అలాగే పనుల పురోగతిపై సమీక్ష నిర్వహించారు.

నిర్మాణ పనులను వేగవంతంగా పూర్తి చేయడంతో పాటు ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సంబంధిత అధికారులను జోనల్ కమిషనర్ ఆదేశించారు. ప్రజలకు ఇబ్బందులు తగ్గించేలా ప్రత్యామ్నాయ మార్గాలపై స్పష్టమైన సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని సూచించారు.

KARUNAKAR, UPPAL

KARUNAKAR, UPPAL

Next Story