L.B. Nagar: అర్ధరాత్రి వేగమే ప్రమాదం.. ఎల్.బి.నగర్‌లో లారీని ఢీకొన్న కారు!

L.B. Nagar: హైదరాబాద్ ఎల్.బి.నగర్ చిత్ర లేఅవుట్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం. రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన కారు.

B SHETTAIAH GOUD, LB NAGAR
Published on: 28 May 2026 10:30 AM IST
L.B. Nagar
X

L.B. Nagar: అర్ధరాత్రి వేగమే ప్రమాదం.. ఎల్.బి.నగర్‌లో లారీని ఢీకొన్న కారు!

ఎల్.బి.నగర్: చిత్ర లేఅవుట్ వద్ద అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీని వేగంగా వచ్చిన కారు ఢీకొట్టడంతో ఇద్దరు గాయపడ్డారు. వివరాల్లోకి వెళితే.. తెల్లవారుజామున 2:30 గంటల సమయంలో చిత్ర లేఅవుట్ ఎదురుగా ఈ ప్రమాదం జరిగింది. సూర్యాపేట జిల్లాకు చెందిన ధరావత్ అశోక్ (24) కారు నడుపుతుండగా రోడ్డు పక్కన నిలిపి ఉన్న లారీని గమనించక ఢీకొట్టాడు.

ఈ ఘటనలో కారు డ్రైవర్ అశోక్‌తో పాటు కారులో ప్రయాణిస్తున్న సరూర్‌నగర్‌కు చెందిన *బొర్రా మధు (51)*కు స్వల్ప గాయాలయ్యాయి. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను చికిత్స నిమిత్తం కామినేని ఆసుపత్రికి తరలించారు. ఇద్దరూ చికిత్స పొందుతున్నారు. ప్రమాదంపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న పోలీసులు.

B SHETTAIAH GOUD, LB NAGAR

B SHETTAIAH GOUD, LB NAGAR

Next Story