Vikarabad: వికారాబాద్ వద్ద రోడ్డు ప్రమాదం.. తప్పిన ప్రాణాపాయం
Vikarabad: వికారాబాద్ జిల్లా దన్నారం వద్ద భారీ గేటును తప్పించబోయి కారు విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది; వాహనం ధ్వంసమైనా ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు.
Vikarabad: వికారాబాద్ వద్ద రోడ్డు ప్రమాదం.. తప్పిన ప్రాణాపాయం
వికారాబాద్ జిల్లా: జిల్లాలోని దన్నారం గ్రామ సమీపంలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. హైదరాబాద్ నుంచి వికారాబాద్ వైపు కుటుంబ సభ్యులతో కలిసి కారులో ప్రయాణిస్తున్న వారు దన్నారం గ్రామం వద్దకు చేరుకోగానే ప్రమాదానికి గురయ్యారు.
గ్రామ సమీపంలో ఉన్న భారీ గేట్‌ను తప్పించబోయే క్రమంలో కారు అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న విద్యుత్ స్తంభాన్ని బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో కారు పూర్తిగా ధ్వంసమైంది.
అయితే, కారులో ప్రయాణిస్తున్న కుటుంబ సభ్యులకు ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో పెను ప్రమాదం తప్పినట్లయింది. దీంతో కుటుంబ సభ్యులతో పాటు స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.
ఈ ప్రమాదానికి గల పూర్తి కారణాలు తెలియాల్సి ఉంది. ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు వెల్లడికావాల్సి ఉంది.




