Rajendranagar: ఆరాంఘర్‌లో బుల్డోజర్ల గర్జన వ్యాపారుల ఆవేదన.. పోలీసుల పహారా!

Rajendranagar: రాజేంద్రనగర్ ఆరాంఘర్ చౌరస్తాలో రోడ్డు విస్తరణ పనులు ఉత్కంఠ రేపాయి. భారీ పోలీసు బందోబస్తు మధ్య చిరు వ్యాపారుల డబ్బాలను అధికారులు తొలగించారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 4 April 2026 11:44 AM IST
Rajendranagar
X

Rajendranagar: ఆరాంఘర్‌లో బుల్డోజర్ల గర్జన వ్యాపారుల ఆవేదన.. పోలీసుల పహారా!

Rajendranagar: గ్రేటర్ హైదరాబాద్ రాజేంద్రనగర్ అసెంబ్లీ నియోజకవర్గ పరిధి ఆరాంఘర్‌ చౌరస్తాలో రోడ్డు విస్తరణ చర్యలు..

భారీ పోలీసు బందోబస్తు మధ్య చిరు వ్యాపారుల డబ్బాల తొలగింపు..

రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలోని ఆరాంఘర్ చౌరస్తా వద్ద రోడ్డు విస్తరణ పనులు వేగంగా కొనసాగుతున్నాయి.

కూడలి విస్తరణ పనుల్లో భాగంగా రహదారి పక్కన ఉన్న చిరు వ్యాపారుల డబ్బాలను అధికారులు తొలగించే చర్యలు చేపట్టారు.

అయితే ఈ చర్యలపై స్థానిక వ్యాపారుల్లో అసంతృప్తి వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఎలాంటి గొడవలు, ఉద్రిక్తతలు తలెత్తకుండా ముందస్తు జాగ్రత్తగా అధికారులు భారీ పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేశారు.

అధికారులు, పోలీసులు సమన్వయంతో పరిస్థితిని అదుపులో ఉంచుతూ అక్రమనలను తొలగింపు చర్యలు కొనసాగిస్తున్నారు.

ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా రోడ్డు విస్తరణ పనులు త్వరగా పూర్తిచేయాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు.

ముందస్తు సమాచారం ఇవ్వకుండా ఎలా తొలగిస్తారని కాస్త సమయం ఇస్తే తామే తొలగించుకుంటామని చిరు వ్యాపారులు రాజేంద్రనగర్ సర్కిల్ డిసి సురేందర్ రెడ్డిని ప్రాధేయపడ్డారు.

వారి మాటలు ఏ మాత్రం పట్టించుకోకుండా అధికారులు డబ్బాలను తొలగిస్తున్నారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story