Malkajgiri: మల్కాజిగిరి కాంగ్రెస్ ఎస్సీ సెల్ అధ్యక్షుడిగా ధరణ్ కుమార్!

Malkajgiri: మల్కాజిగిరి నియోజకవర్గం బి బ్లాక్ కాంగ్రెస్ ఎస్సీ సెల్ అధ్యక్షుడిగా రొట్టెల ధరణ్ కుమార్ నియమితులయ్యారు. మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి ఆయనకు నియామక పత్రం అందజేశారు.

Bodike Manohar, Malkajgiri
Published on: 8 Sept 2026 8:37 PM IST
Malkajgiri
X

Malkajgiri: మల్కాజిగిరి కాంగ్రెస్ ఎస్సీ సెల్ అధ్యక్షుడిగా ధరణ్ కుమార్!

మల్కాజిగిరి: మల్కాజిగిరి నియోజకవర్గం బి బ్లాక్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ అధ్యక్షుడిగా రొట్టెల ధరణ్ కుమార్ నియమితులయ్యారు. ఈ మేరకు నియామక పత్రాన్ని మల్కాజిగిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు చేతుల మీదుగా ధరణ్ కుమార్ అందుకున్నారు.

ఈ సందర్భంగా ధరణ్ కుమార్ మాట్లాడుతూ తనపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించిన పార్టీ నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. మైనంపల్లి హనుమంతరావు సహకారంతో నియోజకవర్గంలో ఎస్సీ వర్గాల సమస్యల పరిష్కారానికి కృషి చేయడంతో పాటు కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి అహర్నిశలు పనిచేస్తానని పేర్కొన్నారు.

తన నియామకానికి సహకరించిన మల్కాజిగిరి పార్టీ ఇన్‌చార్జి లక్ష్మీకాంత్ రెడ్డి, బి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు వెంకటేష్ యాదవ్, వర్కింగ్ ప్రెసిడెంట్ బి.కె. శ్రీనివాస్, మాజీ కార్పొరేటర్ వై. ప్రేమ్ కుమార్, నాయకులు గుండా నిరంజన్, సతీష్ కుమార్, పిట్టల శ్రీనివాస్, పిట్టల నాగరాజు, సిహెచ్. కౌశలేష్, యూసఫ్ బాయ్‌తో పాటు పార్టీ పెద్దలందరికీ ధరణ్ కుమార్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

Bodike Manohar, Malkajgiri

Bodike Manohar, Malkajgiri

Next Story