Sardar Nagar: సర్దార్ నగర్ శివాలయం భూములపై అదనపు కలెక్టర్‌కు ఫిర్యాదు!
Sardar Nagar: రంగారెడ్డి అదనపు కలెక్టర్‌కు షాబాద్ మండలం సర్దార్ నగర్ శివాలయం ఇనాం భూముల అన్యాక్రాంతంపై గ్రామస్తుల ఫిర్యాదు. రిజిస్ట్రేషన్లు నిలిపివేయాలని వినతి.
Sardar Nagar: సర్దార్ నగర్ శివాలయం భూములపై అదనపు కలెక్టర్‌కు ఫిర్యాదు!
Sardar Nagar: షాబాద్ మండలంలోని సర్దార్ నగర్ గ్రామంలో సర్వేనెంబర్ 428, 429లో 14 ఎకరాల 15 గుంటల భూమి గత 100 సంవత్సరాలనుండి శ్రీ సంగమేశ్వర స్వామి దేవాలయం శివాలయానికి సంబంధించినభూమిలో పరిగణిస్తున్నామని కానీ ప్రస్తుతం పౌరోహిత్యం చేసిన అర్చకులు మాకు భూమి వారసత్వంగా వచ్చిందని భూమిని విక్రయించుటకు పూనుకున్నారని దానిపై తక్షణమే చర్యలు తీసుకొని రిజిస్ట్రేషన్ కాకుండా ఆపాలని రంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ కు సర్దార్ నగర్ గ్రామస్తులు ప్రజావాణి కార్యక్రమంలో ఫిర్యాదు చేశారు. గ్రామంలో పర్యటించి గ్రామస్థుల నుంచి వివరాలు సేకరించి పురోహితులు భూమిని విక్రయించకుండా మొత్తం భూమిని దేవాలయం పేరున చేయాలని కోరారు. అనంతరం షాబాద్ మండల తహశీల్దార్ ఎండి అన్వర్ ను సర్దార్ నగర్ గ్రామస్తులు సంప్రదించి దేవాలయ భూమిని రిజిస్ట్రేషన్ చేయకుండా ఆపాలని వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో అశోక్, విష్ణు, నవీన్, యాదయ్య, రమేష్, చెన్నయ్య తదితర గ్రామస్తులు పాల్గొన్నారు.




