Boduppal: చెంగిచెర్లలో రూ.1.25 కోట్లతో సీసీ రోడ్ల పనులకు శంకుస్థాపన!

Boduppal: బోడుప్పల్ సర్కిల్ పరిధిలోని చెంగిచెర్లలో రూ.1.25 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించనున్న పలు సీసీ రోడ్ల పనులకు మాజీ మేయర్ తోటకూర అజయ్ యాదవ్ శంకుస్థాపన చేశారు.

KARUNAKAR, UPPAL
Published on: 10 Nov 2026 11:21 AM IST
Boduppal
X

Boduppal: చెంగిచెర్లలో రూ.1.25 కోట్లతో సీసీ రోడ్ల పనులకు శంకుస్థాపన!

Boduppal: బోడుప్పల్‌ సర్కిల్‌ అభివృద్ధే ధ్యేయంగా వివిధ డివిజన్లలో మౌలిక వసతుల కల్పనకు ప్రత్యేక ప్రాధాన్యమిస్తూ అభివృద్ధి పనులకు తోడ్పాటునందిస్తున్నట్లు మాజీ మేయర్‌ తోటకూర అజయ్‌ యాదవ్‌ తెలిపారు. మేడ్చల్‌–మల్కాజిగిరి జిల్లా బోడుప్పల్‌ సర్కిల్‌ పరిధిలోని చెంగిచెర్ల డివిజన్‌లో సుభోదయ కాలనీ, గ్రీన్‌సిటీ కాలనీ, శ్రీలక్ష్మీనగర్‌, వివేక్‌నగర్‌, లెక్చరర్స్‌ కాలనీల్లో రూ.1.25 కోట్ల వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్ల నిర్మాణ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా అజయ్‌ యాదవ్‌ మాట్లాడుతూ.. ప్రజల అవసరాలకు అనుగుణంగా కాలనీల్లో మౌలిక వసతులు మెరుగుపరిచేందుకు కృషి చేస్తున్నామని, మెరుగైన రహదారి సౌకర్యాలు కల్పించడమే లక్ష్యంగా అభివృద్ధి పనులు చేపడుతున్నామని పేర్కొన్నారు.

బోడుప్పల్‌ సర్కిల్‌ పరిధిలోని అన్ని డివిజన్ల అభివృద్ధికి తన వంతు సహకారం అందిస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో బోడుప్పల్‌ మాజీ డివిజన్‌ అధ్యక్షుడు పొగుల నర్సింహారెడ్డి, మాజీ డిప్యూటీ మేయర్‌ కొత్త శ్రావంతి కిషోర్‌గౌడ్‌, చెంగిచెర్ల డివిజన్‌ అధ్యక్షుడు పొగుల దిలీప్‌రెడ్డి, బోడుప్పల్‌ డివిజన్‌ అధ్యక్షుడు బొమ్మక్‌ కళ్యాణ్‌, మాజీ కార్పొరేటర్‌ సింగిరెడ్డి పద్మారెడ్డి, కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలు, కాలనీ సంక్షేమ సంఘాల ప్రతినిధులు, స్థానికులు పాల్గొన్నారు.

KARUNAKAR, UPPAL

KARUNAKAR, UPPAL