Ibrahimpatnam: నకిలీ ఉద్యోగ పత్రాలతో బ్యాంక్‌కు రూ.30 లక్షల టోకరా!
Ibrahimpatnam: రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో నకిలీ ఆధార్, పాన్ కార్డ్, ఉద్యోగ పత్రాలతో ఐసీఐసీఐ బ్యాంకుకు రూ.30 లక్షల రుణం మోసం చేసిన ముఠా గుట్టురట్టు చేసిన పోలీసులు.
Ibrahimpatnam: నకిలీ ఉద్యోగ పత్రాలతో బ్యాంక్‌కు రూ.30 లక్షల టోకరా!
Ibrahimpatnam: రంగారెడ్డి జిల్లా, ఇబ్రహీంపట్నంలో పోలీసుల విచారణలో వెలుగులోకి సంచలన విషయాలు. గంటల శంకర్ పేరుతో నకిలీ గుర్తింపు, ఉద్యోగ ధ్రువీకరణ పత్రాల తయారీ. బెంగళూరులోని CAPCO Technologies కంపెనీలో సీనియర్ కన్సల్టెంట్‌గా పనిచేస్తున్నట్లు నకిలీ పత్రాల సృష్టి. ఈ పత్రాలతో ICICI బ్యాంకు నుంచి రూ.30 లక్షల రుణం మంజూరు.
రుణం మంజూరు చేయించినందుకు మధ్యవర్తికి రూ.6.70 లక్షల కమిషన్ చెల్లింపు. గంటల శంకర్ పేరుతో క్రెడిట్ కార్డు పొంది రూ.3 లక్షల పరిమితిని కూడా వినియోగించినట్లు వెల్లడి. ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగులోకి వచ్చిన ఈ భారీ మోసంపై పోలీసులు తదుపరి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.




