Amanagal: రూ. 40 లక్షలతో శ్రీకాంత్ కాలనీలో సీసీ రోడ్డు

Amanagal: ఆమనగల్ మున్సిపాలిటీ 9వ వార్డు శ్రీకాంత్ కాలనీలో రూ.40 లక్షలతో చేపడుతున్న సీసీ రోడ్డు పనులను చైర్మన్ పత్యా నాయక్, కౌన్సిలర్ మహేష్ పరిశీలించారు.

SRI SAILAM, KALWAKURTHY
Published on: 31 Oct 2026 3:03 PM IST
Amanagal
X

Amanagal: రూ. 40 లక్షలతో శ్రీకాంత్ కాలనీలో సీసీ రోడ్డు

రంగారెడ్డి జిల్లా: ఆమనగల్ మున్సిపాలిటీ పరిధిలో వార్డుల అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తూ చేపడుతున్న పనులను నాణ్యతా ప్రమాణాలతో పూర్తి చేయాలని మున్సిపల్ చైర్మన్ పత్యా నాయక్, 9వ వార్డు కౌన్సిలర్ ఎర్రవోలు మహేష్ సూచించారు. ఆమనగల్ మున్సిపాలిటీలోని 9వ వార్డు పరిధిలో శ్రీకాంత్ కాలనీ నుంచి బీఎస్ఎన్ఎల్ కార్యాలయం ప్రధాన రహదారి వరకు రూ.40 లక్షల నిధులతో చేపడుతున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులను వారు కలిసి పరిశీలించారు.

ఈ సందర్భంగా పనుల పురోగతిని క్షేత్రస్థాయిలో పరిశీలించి, నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ నిర్ణీత సమయంలో పనులను పూర్తి చేయాలని సంబంధిత సిబ్బందికి సూచించారు.

కాలనీలో ఇప్పటికే పలు అభివృద్ధి పనులు చేపట్టామని, ప్రజల అవసరాలను గుర్తించి రానున్న రోజుల్లో మరిన్ని నిధులు తీసుకొచ్చి అదనపు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేందుకు కృషి చేస్తామని కౌన్సిలర్ ఎర్రవోలు మహేష్ తెలిపారు. ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించడమే లక్ష్యంగా వార్డులో అభివృద్ధి పనులను నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో 8వ వార్డు కౌన్సిలర్ ఎనుమల్ల రమేష్, కోఆప్షన్ సభ్యులు చుక్క అల్లాజి, ఖాదర్, వర్క్ ఇన్‌స్పెక్టర్ షర్ఫోడ్డిన్, టౌన్ ప్లానర్ రామకృష్ణ, శ్రీకాంత్ కాలనీవాసులు పసుపుల బాబు, సామల రవి, కోట సురేందర్, శ్రీధర్, శేఖర్, కోనాపురం వెంకటయ్య, తిప్పిరెడ్డి రామిరెడ్డి, గుత్తి మనోహర్, దాస్యం వెంకన్న, రాములు, దాస్యం వంశీ, హరి, సాయి తదితరులు పాల్గొన్నారు.

SRI SAILAM, KALWAKURTHY

SRI SAILAM, KALWAKURTHY