Abdullapurmet: రేవంత్ ప్రభుత్వం బండరావిరాలను జవహర్‌నగర్‌లా మారుస్తోంది

Abdullapurmet: బండరావిరాల ఎకో టౌన్ (డంపింగ్ యార్డ్) ప్రాజెక్టుకు వ్యతిరేకంగా జూన్ 29న రంగారెడ్డి కలెక్టరేట్ ముట్టడి.

AJAY, HAYATH NAGAR
Published on: 27 Jun 2026 8:38 PM IST
Abdullapurmet
X

Abdullapurmet: రేవంత్ ప్రభుత్వం బండరావిరాలను జవహర్‌నగర్‌లా మారుస్తోంది

అబ్దుల్లాపూర్‌మెట్: అబ్దుల్లాపూర్‌మెట్ మండలం బండరావిరాల గ్రామ పరిధిలో ప్రజల అనుమతి లేకుండా, వారి ప్రాణాలతో చెలగాటమాడుతూ ఏర్పాటు చేయాలని చూస్తున్న ఎకో టౌన్ ప్రాజెక్టు (డంపింగ్ యార్డు) వ్యతిరేకంగా బిఆర్ఎస్ పార్టీ పోరాటానికి సిద్ధమైంది. ఈ నేపథ్యంలో ఈరోజు బండరావిరాల గ్రామ సర్పంచ్ కందికంటి విజయ్ కుమార్ పాటు బిఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు, స్థానికులు కలిసి బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ తెలంగాణ భవన్ లో మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది ఈ నెల 29వ తేదీన చేపట్టబోయే రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమానికి మద్దతు కోరగా, ఆయన ఈ ప్రజా పోరాటానికి బిఆర్ఎస్ పార్టీ తరఫున సంపూర్ణ మద్దతును ప్రకటిస్తూ అధికారికంగా ప్రకటన విడుదల చేశారు.

​గతంలో పదుల సంఖ్య లో క్రషర్ల దోపిడీకి వ్యతిరేకంగా దాదాపు 400 రోజుల పాటు సుదీర్ఘంగా, వీరోచితంగా ధర్నా చేసినా బండరావిరాల గ్రామం, ఇప్పుడు మరోసారి డంపింగ్ యార్డ్‌కు వ్యతిరేకంగా అంతకంటే పెద్ద ఎత్తున పోరాటానికి సిద్ధమైందని ఈ సందర్భంగా బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ గుర్తుచేశారు. స్థానిక ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిలు బడా పారిశ్రామికవేత్తల ప్రయోజనాల కోసం, ముడుపులు తీసుకుని ప్రజల జీవితాలను ఫణంగా పెడుతున్నారని ఆయన ఆరోపించారు. జవహర్‌నగర్ డంపింగ్ యార్డ్ తరహాలోనే, ఇప్పుడు హైదరాబాద్ మహానగరంలోని చెత్తనంతటినీ ఇక్కడకు తరలించి ఈ ప్రాంతాన్ని కాలుష్య కాసారంగా మార్చేందుకు ప్రభుత్వం కుట్ర చేస్తోందని మండిపడ్డారు.

​బండరావిరాల చుట్టుపక్కల ఉన్న చిన్నరావిరాల, పిల్లాయిపల్లి, పెద్దగూడెం, జగత్‌పల్లి, దేశ్‌ముఖి, కవాడిపల్లి, బాచారం తో పాటు దాదాపు 15 గ్రామాలు ఈ డంపింగ్ యార్డ్ వల్ల తీవ్రమైన కాలుష్య బారిన పడి, ప్రజలు, ముఖ్యంగా చిన్న పిల్లలు రోగాల పాలయ్యే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజలు ఓట్లేసి గెలిపిస్తే వారికి డంపింగ్ యార్డ్‌ను బహుమతిగా ఇస్తారా అని పాలను ప్రశ్నించారు. పార్టీ నాయకత్వ మార్గదర్శకత్వంలో ఈ 15 గ్రామాల ప్రజలను కాపాడుకుంటామని, ఈ డంపింగ్ యార్డ్ ఇక్కడి నుండి తరలిపోయే వరకు పోరాటం ఆపబోమని స్పష్టం చేశారు. ప్రభుత్వ దోపిడీ విధానాలను ఎండగడుతూ ఈ నెల 29న జరిగే రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ ముట్టడిని జయప్రదం చేయాలని, ఈ కార్యక్రమంలో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు, స్థానిక నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ నిరసనను బలంగా చాటాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ అబ్దుల్లా పూర్ మండల అధ్యక్షులు కొత్త కిషన్ గౌడ్, బండరావిరాల గ్రామ సర్పంచ్ కందికంటి విజయకుమార్ ,సీనియర్ నాయకులు మొలుగు దానేశ్, కావాడి దయాకర్ రెడ్డి, ఉపసర్పంచ్ దూస శంకర్ ముదిరాజ్, వార్డు సభ్యులు కందికంటి అనూష - ప్రవీణ్, కన్నె భరత్ యాదవ్ మరియు యువ నాయకులు ఏమ్ముల శివ శంకర్ మరియు కొత్త శ్రీకాంత్ గౌడ్ పాల్గొన్నారు.

AJAY, HAYATH NAGAR

AJAY, HAYATH NAGAR

Next Story