Saifabad: టీజీ ఆర్టీసీ సిబ్బంది సమయస్ఫూర్తి.. తప్పిన పెద్ద ప్రమాదం!

Saifabad: పటాన్‌చెరువు మైనారిటీ గురుకుల బాలికను టీజీ ఆర్టీసీ మిధాని డిపో కండక్టర్ శేఖర్, డ్రైవర్ కుమార్ చాకచక్యంగా కాపాడి సైఫాబాద్ పోలీసులకు అప్పగించారు.

G. Rama Krishna, Hyderabad
Published on: 28 July 2026 11:47 PM IST
Saifabad
X

Saifabad: టీజీ ఆర్టీసీ సిబ్బంది సమయస్ఫూర్తి.. తప్పిన పెద్ద ప్రమాదం!

సైఫాబాద్: ఈరోజుల్లో మనకెందుకులే అనే స్వభావం చాలామందిలో ఉంటుంది కానీ, ఒక ఆర్టీసీ బస్సు (మిధాని డిపో) కండక్టర్ (శేఖర్), డ్రైవర్ (జె.ఎస్.కుమార్) చొరవ ఒక విద్యార్థిని కాపాడింది. పటాన్ చెరువులోని తెలంగాణ మైనారిటీ గురుకులం విద్యార్థిని అనూహ్యంగా పటాన్ చెరువు వద్ద ఆర్టీసీ బస్సు (నెం.218) ఎక్కింది.

చేతిలో పది రూపాయల నోటు తప్ప ఆ బాలిక వద్ద ఏమి లేవు, కాళ్లకు చెప్పులు కూడా లేవు, కండక్టర్ టికెట్ అడిగినప్పుడు దీనంగా అదోరీతిలో చూసింది. కండక్టర్కు అనుమానం వచ్చింది, విషయన్ని డ్రైవర్ కు చెప్పాడు, ఇద్దరూ ఆ అమ్మాయిని కనిపెడుతూనే ఉన్నారు.

పక్కన ఉన్న ప్యాసింజర్ వద్ద ఫోన్ తీసుకొని ఆ అమ్మాయి ఎవరికో మాట్లాడింది ఆ నెంబర్ ఆధారంగా ఆఅమ్మాయి మైనారిటీ గురుకులం విద్యార్థిగా నిర్ధారణ అయింది. దాంతో తోటి ప్రయాణికులకు చెప్పడంతో ఆఅమ్మాయి వెనుక నుంచి కదులుతున్న బస్సులోంచి దిగేందుకు ప్రయత్నించింది.

ప్రయాణికులు అందరూ ఆమెను పట్టుకొని, సముదాయించి చివరకు సైఫాబాద్ పోలీస్ స్టేషన్ లో అప్పగించడం జరిగింది. ఈఉదంతంలో తెలంగాణ ఆర్టీసీ అన్నలు చూపిన చొరవ అభినందనీయం.

G. Rama Krishna, Hyderabad

G. Rama Krishna, Hyderabad

Next Story