LB Nagar: సర్కారు నిర్లక్ష్యంతోనే ఆర్టీసీ సమ్మె: ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి
LB Nagar: దిల్‌సుఖ్‌నగర్‌లో ఆర్టీసీ సమ్మెకు మద్దతుగా ధర్నా జరిగింది. ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
LB Nagar
LB Nagar: ఎల్బీనగర్ నియోజకవర్గంలో ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతుగా నిర్వహించిన ధర్నా కార్యక్రమంలో ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి పాల్గొన్నారు. దిల్‌సుఖ్‌నగర్ సిటీ డిపో వద్ద ఆర్టీసీ జేఏసీ ఆధ్వర్యంలో ఈ ధర్నా నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆర్టీసీ ఉద్యోగుల డిమాండ్లను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని కోరారు. ప్రభుత్వ నిర్లక్ష్యం, మొండి వైఖరి కారణంగానే ఉద్యోగులు సమ్మెకు దిగారని ఆరోపించారు. సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వం చొరవ తీసుకుని సమ్మెను విరమించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో ఆర్టీసీ యూనియన్ నాయకులు, చైతన్యపురి డివిజన్ బీఆర్ఎస్ యువ నాయకులు సొంటి చంద్రశేఖర్ రెడ్డి సహా పలువురు నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
Next Story




