Vikarabad: తాండూరులో ఆర్టీసీ మౌన పోరాటం.. శంకర్ గౌడ్ మృతికి సంతాపం!

Vikarabad: వికారాబాద్ జిల్లా తాండూరులో ఆర్టీసీ కార్మికుల సమ్మె మూడో రోజుకు చేరుకుంది.

SRIKANTH, TANDUR
Published on: 24 April 2026 12:59 PM IST
Vikarabad
X

Vikarabad: తాండూరులో ఆర్టీసీ మౌన పోరాటం.. శంకర్ గౌడ్ మృతికి సంతాపం!

వికారాబాద్ జిల్లా: వికారాబాద్ జిల్లా తాండూరులో ఆర్టీసీ జేఏసీ పిలుపుమేరకు జరుగుతున్న సమ్మె మూడవ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా ప్రజా సంఘ నాయకులు మాట్లాడుతూ..

తమ డిమాండ్ల పరిష్కారం కోసం ఆర్టీసీ కార్మికులు సమ్మె కొనసాగించడంతో సాధారణ రవాణా సేవలు దెబ్బతిన్నాయి. శంకర్ గౌడ్ మృతి పట్ల మౌనం పాటిస్తూ నిరసన.. శంకర్ గౌడ్ మరణం ప్రభుత్వ హత్య అని కొనియాడారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఆర్టీసీతో చర్చలు జరిపి తమ డిమాండ్లు నెరవేర్చాలని కోరారు. రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా తాండూర్ లో మాత్రం సమ్మెకు సహకరిస్తే టెంట్ హౌస్ లపై కేసులు పెడుతున్న వైనం.. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ఆర్టీసీ అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేపట్టారు. ప్రైవేటు బస్సులను ఏర్పాటు చేసి, పోలీసుల భారీ బందోబస్తు మధ్య ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరవేస్తున్నారు. సమ్మె కొనసాగుతున్న పరిస్థితుల్లో రవాణా పూర్తిగా సవ్యంగా లేకపోవడంతో ప్రయాణికులు అసౌకర్యానికి గురవుతున్నారు.. సమస్య త్వరగా పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు.

SRIKANTH, TANDUR

SRIKANTH, TANDUR

Next Story