Hayathnagar: డిపోల్లో ప్రశాంతంగా ఆర్టీసీ గుర్తింపు సంఘం ఎన్నికలు!

Hayathnagar: హయత్‌నగర్ డిపో-1, డిపో-2లలో ప్రశాంతంగా కొనసాగుతున్న ఆర్టీసీ గుర్తింపు సంఘం ఎన్నికల పోలింగ్. రాత్రి 10 గంటలకు ఫలితాల వెల్లడి. పూర్తి వివరాలు.

AJAY, HAYATH NAGAR
Published on: 9 Oct 2026 8:57 AM IST
Hayathnagar
X

Hayathnagar: డిపోల్లో ప్రశాంతంగా ఆర్టీసీ గుర్తింపు సంఘం ఎన్నికలు!

Hayathnagar: టీజీఎస్‌ఆర్టీసీ గుర్తింపు సంఘం ఎన్నికల పోలింగ్ హయత్‌నగర్ డిపో-1, డిపో-2లో ప్రశాంతంగా కొనసాగుతోంది. శుక్రవారం ఉదయం 5 గంటలకు పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు.

హయత్‌నగర్ డిపో-1 పరిధిలో 477 మంది, డిపో-2 పరిధిలో 269 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగేందుకు అధికారులు అవసరమైన ఏర్పాట్లు చేశారు. పోలింగ్ కేంద్రాల వద్ద పోలీసులు భద్రతను పర్యవేక్షిస్తున్నారు.

రెండు డిపోల్లోనూ పోలింగ్ ప్రశాంత వాతావరణంలో కొనసాగుతుండగా, రాత్రి 10 గంటలకు ఎన్నికల ఫలితాలను వెల్లడించనున్నారు.

AJAY, HAYATH NAGAR

AJAY, HAYATH NAGAR