Hyderabad: కొత్త RTI యాప్ వచ్చేసింది.. లాంచ్ చేసిన జయప్రకాష్ నారాయణ!
Hyderabad: సమాచార యుగంలో పారదర్శకత కోసం సరికొత్త ఆర్టీఐ (RTI) యాప్ అందుబాటులోకి వచ్చింది.
Hyderabad: కొత్త RTI యాప్ వచ్చేసింది.. లాంచ్ చేసిన జయప్రకాష్ నారాయణ!
hyderabad: ఆర్ టి ఐ యాక్ట్ పారదర్శకత కోసం ప్రత్యేక యాప్ ఉపయోగపడుతుందని మాజీ ఎమ్మెల్యే లోక్ సత్తా అధ్యక్షుడు జయప్రకాష్ నారాయణ అన్నారు. సమాచార యుగంలో పారదర్శకత కోసం ప్రత్యేక యాప్ న రూపొందించడం శుభసూచకమని మాజీ ఎమ్మెల్యే లోక్సత్తా పార్టీ అధ్యక్షుడు జయప్రకాష్ నారాయణ అన్నారు. శుక్రవారం హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఆర్టిఐ యాప్ ఆవిష్కరణ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతథిగా హాజరై మాట్లాడారు. ఈ ప్రత్యేక యాప్ ద్వారా సమాచారాన్ని సార్వజనీయణం చేసేందుకు అవకాశాలుగా ఉన్నాయన్నారు.
సమాచారం అందరికీ అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ఈ యాప్ ఉపయోగపడుతుందని అలాగే పన్ను చెల్లిస్తున్న ప్రతి పౌరుడికి సమాచారం ఇవ్వటం ఎంతో ముఖ్యం అన్నారు.ఇటీవలే బంజారా హిల్స్ కే బి ఆర్,జాతీయ పార్క్ నిర్మాణ పనులను వ్యతిరేకిస్తూ పలువురు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు అంటే?వారికి ఆ ప్రాజెక్టు వివరాలను తెలియపరేచే బాధ్యత అధికారులకు పాలకులపై ఉందానీ గుర్తు చేశారు.ప్రజాస్వామ్యంలో ప్రజలకు జవాబుదారీగా ఉంటూ మౌలిక సదుపాయాలు,ఆర్థిక బలోపేతానికి కృషి చేస్తూ,మంచి నీరు,మురుగు నీరు వ్యవస్థ,రైతుల సమస్యలు,ఆరోగ్య సంరక్షణ,విద్య వ్యవస్థ బలోపేతం కోసం ప్రభుత్వం చేసే ప్రతి విషయాన్ని ప్రజలకు తెలియజేయేలని అప్పుడే అభివృద్ధి ప్రజలు ఓటు వేసి ఎన్నుకున్నందుకు విలువ ఉంటుందానీ తెలిపారు.
ఈ కార్యక్రమంలో అప్ వ్యవస్థకులు ఇతిహాస్, గంజి శ్రీనివాస్, మధు బాబు, ఆనం చిన్ని కృష్ణా తదితరులు పాల్గొన్నారు.




