Quthbullapur: జన్మదినం వేళ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్‌ను కలిసిన బిఆర్ఎస్ నేత రుద్ర అశోక్
Quthbullapur: జగద్గిరిగుట్ట బిఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు రుద్ర అశోక్ పుట్టినరోజు సందర్భంగా ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ కేక్ కట్ చేయించి శాలువాతో సత్కరించారు.
Quthbullapur: జన్మదినం వేళ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్‌ను కలిసిన బిఆర్ఎస్ నేత రుద్ర అశోక్
కుత్బుల్లాపూర్: కుత్బుల్లాపూర్ నియోజక వర్గం జగద్గిరిగుట్ట డివిజన్ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రుద్ర అశోక్ జన్మదినం సందర్భంగా కుత్బుల్లాపూర్ లోని ఎమ్మెల్యే నివాస కార్యాలయం వద్ద బిఆర్ఎస్ ఎల్పీ విప్, ఎమ్మెల్యే కేపీ.వివేకానంద్ ని మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా డివిజన్ అధ్యక్షులు రుద్ర అశోక్ ను ఎమ్మెల్యే కేక్ కట్ చేయించి శాలువాతో సత్కరించి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రజా సేవలో మరింత ఉత్సాహంగా ముందుకు సాగుతూ ప్రజల సంక్షేమం కోసం పనిచేయాలని ఎమ్మెల్యే ఆశీర్వదించారు.
ఈ కార్యక్రమంలో నియోజకవర్గ యూత్ అధ్యక్షులు దూదిమెట్ల సోమేష్ యాదవ్, డివిజన్ అధ్యక్షులు పుప్పాల భాస్కర్, పోలే శ్రీకాంత్, జగద్గిరిగుట్ట వెంకటేశ్వర దేవస్థానం మాజీ చైర్మన్ వేణు యాదవ్, పలువురు నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.




