Mokila: ఎక్స్పీరియంలో “రన్ ఫర్ కల్చర్ – రన్ ఫర్ చేంజ్” కార్యక్రమం

Mokila: రంగారెడ్డి జిల్లా మొకిల ఎక్స్పీరియంలో 'రన్ ఫర్ కల్చర్ – రన్ ఫర్ చేంజ్' కార్యక్రమం.

RAGHAVENDRA, CHEVELLA
Published on: 14 Jun 2026 12:49 PM IST
Mokila
X

Mokila: ఎక్స్పీరియంలో “రన్ ఫర్ కల్చర్ – రన్ ఫర్ చేంజ్” కార్యక్రమం

రంగారెడ్డి జిల్లా, చేవెళ్ల: శంకర్‌పల్లి మండలం పొద్దుటూరు గ్రామ పరిధిలోని మొకిల ఎక్స్పీరియంలో ఆదివారం “రన్ ఫర్ కల్చర్ – రన్ ఫర్ చేంజ్” కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.పర్యావరణ పరిరక్షణ, ప్లాస్టిక్ రహిత సమాజ నిర్మాణం లక్ష్యంగా నిర్వహించిన ఈ కార్యక్రమానికి హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా సజ్జనార్ 5 కిలోమీటర్ల రన్‌లో పాల్గొని యువతతో కలిసి పరుగులు తీశారు. అనంతరం మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించి పర్యావరణ పరిరక్షణకు తమ వంతు బాధ్యతను నిర్వర్తించాలని పిలుపునిచ్చారు.

ప్లాస్టిక్ వినియోగం వల్ల భూతాపం పెరిగి వాతావరణ మార్పులు తీవ్రతరమవుతున్నాయని, ఈ సమస్యను అధిగమించాలంటే మార్పు ప్రతి ఇంటి నుంచే ప్రారంభం కావాలని అన్నారు. పర్యావరణ హితమైన జీవన విధానాలను అలవర్చుకోవడం ద్వారా భావితరాలకు స్వచ్ఛమైన ప్రకృతిని అందించగలమని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన గండిపేట సొసైటీ ప్రతినిధులకు ఆయన ప్రత్యేక అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో ప్రజలు, యువత, పర్యావరణ ప్రేమికులు పాల్గొని విజయవంతం చేశారు.

RAGHAVENDRA, CHEVELLA

RAGHAVENDRA, CHEVELLA

Next Story