Hyderabad: సరూర్‌నగర్‌లో రన్ ఫర్ లేక్ రీనోవేషన్.. సందడి చేసిన నటి పాయల్

Hyderabad: హైదరాబాద్‌లోని సరూర్‌నగర్ చెరువు పునరుద్ధరణ కోసం "రన్ ఫర్ లేక్ రీనోవేషన్" పేరిట 3K రన్ నిర్వహించారు.

RAHUL, MEERPET
Published on: 17 May 2026 12:20 PM IST
Hyderabad
X

Hyderabad: సరూర్‌నగర్‌లో రన్ ఫర్ లేక్ రీనోవేషన్.. సందడి చేసిన నటి పాయల్

Hyderabad: సరూర్‌నగర్ సరస్సు సంరక్షణ, పునరుద్ధరణపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు “రన్ ఫర్ సరూర్‌నగర్ లేక్ రీనోవేషన్” కార్యక్రమం టీటీసీసీ స్పోక్స్‌పర్సన్, మాజీ కార్పొరేటర్ ధర్పల్లి రాజశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. సరూర్‌నగర్ లేక్ నుంచి ప్రియదర్శిని పార్క్ వరకు నిర్వహించిన 3 కిలోమీటర్ల రన్‌ను సినీ నటి పాయల్ రాధకృష్ణ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సరస్సుల సంరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని, పర్యావరణ పరిరక్షణ కోసం ప్రజలంతా చైతన్యంతో ముందుకు రావాలని పిలుపునిచ్చారు. మూడు నెలల్లో జరగనున్న వినాయక చవితి సందర్భంగా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ (POP) విగ్రహాలను ఉపయోగించకుండా, పర్యావరణ హితమైన మట్టి గణపతి విగ్రహాలను పూజించి చెరువులో నిమర్జనం చేయాలని అవగాహన కల్పించడానికే ఈ కార్యక్రమం నిర్వహించామని తెలిపారు.

పర్యావరణ పరిరక్షణ, నీటి వనరుల సంరక్షణపై ప్రజల్లో అవగాహన కల్పించడమే ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని ధర్పల్లి రాజశేఖర్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో మల్కాజ్గిరి మున్సిపల్ కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డి,తెలంగాణ రాష్ట్ర రోడ్డు అభివృద్ధి సంస్థ చైర్మన్ మల్ రెడ్డి రాం రెడ్డి,తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ కల్వ సుజాత,ఎల్బీనగర్ ఏసిపి కృష్ణయ్య,నల్గొండ గద్దర్ నర్సన్న, యువత, మహిళలు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

RAHUL, MEERPET

RAHUL, MEERPET

Next Story