Shamshabad: తృటిలో తప్పిన ఘోర ప్రమాదం.. చూస్తుండగానే కాలి బూడిదైన కారు
Shamshabad: హైదరాబాద్ నుండి శంషాబాద్ వస్తున్న కారు ఇంజన్‌లో అర్ధరాత్రి మంటలు చెలరేగాయి. ఆందోళనలో డ్రైవర్ బైక్‌ను ఢీకొట్టడంతో ఇద్దరికి గాయాలయ్యాయి.
Shamshabad: తృటిలో తప్పిన ఘోర ప్రమాదం.. చూస్తుండగానే కాలి బూడిదైన కారు
శంషాబాద్: నడుస్తున్న కారు ఇంజన్ లో చెలరేగిన మంటలు. తృప్తిలో తప్పిన ఘొర ప్రమాదం. కారు ఇంజన్లో నుండి వస్తున్న మంటలను గమనించిన డ్రైవర్ అదుపుతప్పి ముందుగా వెళుతున్న ద్విచక్ర వాహనాని ఢీకొట్టడంతో ఇద్దరికీ గాయాలు.
గాయపడ్డ ఇద్దరు వ్యక్తులను శంషాబాద్ లోని ప్రైవేట్ హాస్పిటల్‌కు తరలింపు. కారు డ్రైవర్ సహా అందులో ఉన్న ప్రయాణికులు ప్రమాదాన్ని గమనించి కిందకు దిగిపోవడంతో తప్పిన పెను ప్రమాదం. హైదరాబాద్ నుండి శంషాబాద్ వైపు వస్తుండగా కారులో చెలరేగిన మంటలు.
అందరూ చూస్తుండగానే కారులో మంటలు చెలరేగి మంటల్లో కారు పూర్తిగా కాలి బూడిదైంది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని ఫైర్ ఇంజన్ ను రప్పించే లోపే కారు పూర్తిగా అగ్నికి ఆహుతి అయింది. కేసు నమోదు చేసిన ఆర్జిఐఏ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.




