Chevella: సొంత నిధులతో సీసీ రోడ్డు నిర్మాణం అభినందనీయం: సబిత ఇంద్రారెడ్డి!
Chevella: చేవెళ్ల మున్సిపాలిటీ ఊరెళ్లలో కౌన్సిలర్ డప్పు సువర్ణ చందు రూ.5 లక్షల సొంత నిధులతో చేపట్టిన సీసీ రోడ్డు పనులను ఎమ్మెల్యే సబిత ఇంద్రారెడ్డి ప్రారంభించారు.
Chevella: సొంత నిధులతో సీసీ రోడ్డు నిర్మాణం అభినందనీయం: సబిత ఇంద్రారెడ్డి!
చేవెళ్ల: చేవెళ్ల మున్సిపాలిటీలోని బిఆర్ఎస్ కౌన్సిలర్ వార్డు అభివృద్ధికి ఎమ్మెల్యే నిధులు ఇవ్వకపోవడంతో సొంత డబ్బుతో రోడ్లు వేయిస్తున్న కౌన్సిలర్లు సువర్ణ చందు అలాగే మున్సిపల్ అయిన మూడు సంవత్సరాలు దాకా ఎలాంటి టాక్సీలు పెంచడానికి లేదు.
కానీ చేవెళ్ల మున్సిపల్ చైర్మన్ మరి ఎందుకు ఇలా ప్రజలని ఇబ్బంది పెట్టి టాక్సీలు వసూలు చేస్తున్నారో ఆలోచించాలి ప్రజలు కూడా ఇప్పటికైనా ప్రజలపై భారం వెయ్యోద్దని చైర్మన్ ని కోరుతున్నారు.
ప్రభుత్వ నిధుల కోసం ఎదురుచూడకుండా ప్రజా అవసరాలను గుర్తించి, సొంత నిధులతో అభివృద్ధి పనులు చేపట్టడం ఎంతో అభినందనీయమని మహేశ్వరం ఎమ్మెల్యే సబిత ఇంద్రారెడ్డి అన్నారు.
2వ వార్డు కౌన్సిలర్ డప్పు సువర్ణ చందు ఊరెళ్ళ లో 5లక్షల తన సొంత నిధులతో చేపట్టిన సీసీ రోడ్డు నిర్మాణ పనులను ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా విచ్చేసి పూజ చేసి ప్రారంభించారు.
అనంతరం మజీ మంత్రి ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ.. ప్రజా ప్రతినిధులు అంటే కేవలం పదవులకే పరిమితం కాకుండా, ప్రజల కష్టసుఖాల్లో పాలుపంచుకుంటూ మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేయాలన్నారు. కౌన్సిలర్ సువర్ణ చందు తన సొంత డబ్బుతో గ్రామంలోని కాలనీవాసుల చిరకాల కోరికైన సీసీ రోడ్డు నిర్మించడం ఆదర్శంగా నిలుస్తుందని ప్రశంసించారు.
రాబోయే రోజుల్లో అభివృద్ధికి, ఇతర సమస్యల పరిష్కారానికి తన వంతు పూర్తి సహకారం ఉంటుందని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలుపెద్ద ఎత్తున పాల్గొన్నారు.




