Maheshwaram: రేవంత్ ప్రభుత్వంపై ఎమ్మెల్యే సబిత తీవ్ర ఆగ్రహం!
Maheshwaram: విద్యుత్ కోతలతో ఎండిపోతున్న పంటలు. మహేశ్వరం రైతులతో ముఖాముఖి నిర్వహించి, రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై ధ్వజమెత్తిన ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి.
Maheshwaram: రేవంత్ ప్రభుత్వంపై ఎమ్మెల్యే సబిత తీవ్ర ఆగ్రహం!
Maheshwaram: రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం కోళ్ల పడకల్ పోరండ్ల గ్రామాల్లో బిఆర్ఎస్ పార్టీ డిప్యూటీ ఫోర్ లీడర్ మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి పర్యటించారు.
రైతులు ఎదుర్కొంటున్న విద్యుత్ సమస్యపై ప్రత్యక్షంగా పర్యటించారు. రైతులు ఎదుర్కొంటున్న విద్యుత్ సమస్యలు, రైతుల పంట పొలాల్లో కరెంటు కోతలతో విద్యుత్ లేక చేతికొచ్చిన పంటకు నీరు అందించక పంటలు ఎండిపోతున్నాయని రైతులు ఎమ్మెల్యే సబితా రెడ్డికి మొరపెట్టుకున్నారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బిఆర్ఎస్ పార్టీ డిప్యూటీ ఫోర్ లీడర్ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ రైతు ప్రభుత్వమని చెప్పుకుంటున్న రేవంత్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర రైతులను అరిగోశ పెడుతున్నారని తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ సమస్య తీవ్రంగా ఉందని ముందస్తు ప్రణాళికలు లేకుండా రేవంత్ సర్కార్ రైతులను నట్టేట ముంచుతుందని సబితా ఇంద్రారెడ్డి ధ్వజమెతరు.
గతంలో కేసీఆర్ ప్రభుత్వంలో తెలంగాణ రాష్ట్రంలో రైతులకు ఉచితంగా కరెంటు అందించిన ఘనత కెసిఆర్ కు దక్కుతుందని తెలంగాణ రాష్ట్రంలో రైతుల పంట పొలాల్లో రెప్పపాటు క్షణం కూడా కరెంటు పోకుండా చూసిన ఘనత కేసిఆర్ కే దక్కుతుందని ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి తెలిపారు.
రేవంత్ సర్కార్ రైతుల పట్ల చిత్తశుద్ధి ఉంటే తెలంగాణ రాష్ట్రంలో ఉచిత విద్యుత్ అమలు చేసి తెలంగాణ రాష్ట్రంలోని రైతులకు కరెంటు పోకుండా చూడాలని వేసిన వరి పంటకు నీళ్లు లేక పంటలు ఎండిపోతున్నాయని చేతికి వచ్చిన పంట కళ్ళముందే నాశనం అవుతుంటే రైతుల గోస ఎవరికి చెప్పుకోవాలని ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ధ్వజమెత్తారు.
ఇప్పటికైనా రైతుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే పంట వేసిన తెలంగాణ రైతంగానికి సక్రమంగా కరెంటు అందించాలని ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో మహేశ్వరం మండలంలోని బిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, విద్యుత్ శాఖ అధికారులు, తదితరులు పాల్గొన్నారు....




