Hyderabad: సైదాబాద్ ప్రధాన చౌరస్తాలో ప్రమాదాల ముప్పు.. పట్టించుకోని పోలీసులు!
Hyderabad: హైదరాబాద్ సైదాబాద్ ప్రధాన చౌరస్తాలో ఫ్లైఓవర్‌తో ట్రాఫిక్ కష్టాలు తీరినా, సిగ్నల్స్ లేకపోవడం వల్ల ప్రమాదాలు పెరుగుతున్నాయి.
Hyderabad: సైదాబాద్ ప్రధాన చౌరస్తాలో ప్రమాదాల ముప్పు.. పట్టించుకోని పోలీసులు!
Hyderabad: హైదరాబాద్ పాతబస్తీలోని చంచల్‌గూడ, సైదాబాద్, దోబీఘాట్, సంతోష్‌నగర్ ప్రాంతాల్లో నూతన ఫ్లైఓవర్ నిర్మాణంతో చంచల్‌గూడ, ఓవైసీ వైపు, చంపాపేట్ వెళ్లే వాహనదారులకు ట్రాఫిక్ కష్టాలు కొంతమేర తగ్గాయి. అయితే, ఫ్లైఓవర్‌తో ట్రాఫిక్ సమస్యకు ఊరట లభించినప్పటికీ.. సైదాబాద్ ప్రధాన చౌరస్తా మాత్రం ప్రమాదాలకు నిలయంగా మారుతోందనే ఆందోళన వ్యక్తమవుతోంది.
సిగ్నల్ లేదు.. నియంత్రణ ఏదీ?
సైదాబాద్ ప్రధాన చౌరస్తాలో ట్రాఫిక్ సిగ్నల్ లేకపోవడంతో మూడు వైపుల నుంచి వచ్చే వాహనాల రాకపోకలు ప్రమాదకరంగా మారుతున్నాయని వాహనదారులు చెబుతున్నారు. వాహనాల వేగాన్ని నియంత్రించి, ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించాల్సిన పోలీసులు.. విధి నిర్వహణలో భాగంగా ఫొటోలు తీయడానికే ప్రాధాన్యత ఇస్తున్నారంటూ కొందరు వాహనదారులు విమర్శిస్తున్నారు. ట్రాఫిక్ నియంత్రణ కంటే ఫొటోలు తీసి టార్గెట్లు పూర్తి చేయడంపైనే దృష్టి పెడుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
సిగ్నల్ ఎప్పుడు ఏర్పాటు చేస్తారు?
సైదాబాద్ ప్రధాన చౌరస్తాలో వెంటనే ట్రాఫిక్ సిగ్నల్ ఏర్పాటు చేసి, వాహనాల వేగాన్ని నియంత్రించడంతో పాటు ప్రమాదాలను నివారించే చర్యలు చేపట్టాలని వాహనదారులు కోరుతున్నారు.
ట్రాఫిక్ సమస్యకు పరిష్కారం లభించిన చోటే ప్రమాదాల ముప్పు పెరుగుతుంటే అధికారులు స్పందించేది ఎప్పుడు? సైదాబాద్ చౌరస్తాలో సిగ్నల్ ఏర్పాటు చేసి ప్రమాదాలకు అడ్డుకట్ట వేస్తారా? లేక ఫొటోలకే ట్రాఫిక్ నియంత్రణ పరిమితం అవుతుందా?




