Sainikpuri: సైనిక్‌పురి ఆర్‌కే ఎన్‌క్లేవ్‌లో ఘనంగా సద్దుల బతుకమ్మ వేడుకలు

Sainikpuri: కాప్రా సర్కిల్ సైనిక్‌పురి ఆర్‌కే ఎన్‌క్లేవ్‌లో సద్దుల బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి. తీరొక్క పూలతో బతుకమ్మలను పేర్చి మహిళలు, చిన్నారులు ఆడిపాడారు.

ASHOK, KAPRA
Published on: 18 Oct 2026 10:53 PM IST
Sainikpuri
X

Sainikpuri: సైనిక్‌పురి ఆర్‌కే ఎన్‌క్లేవ్‌లో ఘనంగా సద్దుల బతుకమ్మ వేడుకలు

కాప్రా: కాప్రా సర్కిల్ సైనిక్‌పురి ఆర్‌కే ఎన్‌క్లేవ్‌లో సద్దుల బతుకమ్మ సంబరాలు ఆదివారం ఘనంగా నిర్వహించారు. జరిగిన ఈ వేడుకల్లో కాలనీ మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని తీరొక్క పూలతో బతుకమ్మలను అందంగా పేర్చి భక్తిశ్రద్ధలతో కొలిచారు.

అనంతరం బతుకమ్మల చుట్టూ తిరుగుతూ సంప్రదాయ పాటలు పాడుతూ మహిళలు, యువతులు, చిన్నారులు ఉత్సాహంగా వేడుకలు జరుపుకున్నారు. ప్రత్యేక ఏర్పాట్లతో నిర్వహించిన కార్యక్రమంతో ఆర్‌కే ఎన్‌క్లేవ్‌లో పండుగ వాతావరణం నెలకొంది.

ఈ సందర్భంగా రాజారావు మాట్లాడుతూ, బతుకమ్మ పండుగ తెలంగాణ ఆడబిడ్డల ఆత్మీయతకు, ప్రకృతి ప్రేమకు, సాంస్కృతిక వైభవానికి ప్రతీకగా నిలుస్తుందని తెలిపారు. తరతరాలుగా వస్తున్న బతుకమ్మ సంప్రదాయాన్ని భావితరాలకు అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు.

బతుకమ్మ వేడుకలు మహిళల్లో ఐక్యతను పెంపొందించడంతో పాటు కుటుంబాల్లో ఆనందాన్ని నింపుతాయని పేర్కొన్నారు. బతుకమ్మ పండుగ సందర్భంగా ప్రతి కుటుంబంలో సుఖసంతోషాలు వెల్లివిరియాలని ఆకాంక్షించారు.

వేడుకల అనంతరం మహిళలు పరస్పరం బతుకమ్మ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. కాలనీవాసులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

ASHOK, KAPRA

ASHOK, KAPRA