LB Nagar: ఎల్బీనగర్‌లో ఆందోళన విద్యుత్ సంస్థలపై సామ రంగారెడ్డి నిప్పులు
LB Nagar: TSPDCL, TRANSCO ప్రజా వ్యతిరేక విధానాలపై ఎల్బీనగర్‌లో బీజేపీ భారీ ఆందోళన చేపట్టింది.
LB Nagar: ఎల్బీనగర్‌లో ఆందోళన విద్యుత్ సంస్థలపై సామ రంగారెడ్డి నిప్పులు
LB Nagar: TSPDCL మరియు TRANSCO నిర్వహణలో జరుగుతున్న తీవ్ర వైఫల్యాలు, విద్యుత్ వినియోగదారులు ఎదుర్కొంటున్న అనేక సమస్యలకు నిరసనగా ఎల్బీనగర్‌లో భారీ ఆందోళన కార్యక్రమం నిర్వహించినట్లు BJP ఎల్బీనగర్ అసెంబ్లీ మరియు మేడ్చల్ రూరల్ ఇంచార్జి సామ రంగారెడ్డి తెలిపారు.
ఆయన మాట్లాడుతూ: ఎల్బీనగర్ నియోజకవర్గంలో విద్యుత్ సేవల నిర్వహణలో నిర్లక్ష్యం, ప్రణాళికా లోపాల వల్ల ప్రజలపై అదనపు ఆర్థిక భారం పడుతోంది. పెరుగుతున్న విద్యుత్ అంతరాయాలు ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. లక్షల రూపాయలు చెల్లిస్తున్న వినియోగదారులకు కూడా నాణ్యమైన విద్యుత్ సేవలు అందకపోవడం ఆందోళనకరం అన్నారు.
ప్రధాన డిమాండ్లు:
1. కేటగిరి-8 విద్యుత్ కనెక్షన్లతో వినియోగదారులపై మోయలేని భారం: గతంలో కొత్త గృహాలు, వ్యాపార సముదాయాలకు డొమెస్టిక్, కమర్షియల్ కనెక్షన్లకు 3 నుంచి 6 రూపాయలు వసూలు చేసేవారు. కానీ గత మూడు నెలలుగా నిర్మాణం చేస్తున్న ప్రతి గృహానికి తప్పనిసరిగా కేటగిరి-8 కనెక్షన్ తీసుకోవాలని విద్యుత్ సంస్థ డిమాండ్ చేస్తోంది. ఈ కేటగిరి కనెక్షన్‌కు 45 వేల రూపాయలు ముందుగా చెల్లించాలి, ప్రతి యూనిట్‌కు 12 రూపాయలు వస్తుంది. దీనితో నిర్మాణదారులపై రెట్టింపు ఆర్థిక భారం పడుతుంది. అనుమతి ఉన్న పోర్షన్‌కే విద్యుత్ మీటర్లు ఇవ్వడం, అదనంగా నిర్మించుకున్న గదులకు డొమెస్టిక్ మీటర్లు ఇవ్వకుండా కేటగిరి-8నే కొనసాగించడంతో ఒక్కో యూనిట్‌కు 12 రూపాయలు పడుతుంది. దీనిని వెంటనే సమీక్షించి గృహ నిర్మాణాలకు డొమెస్టిక్ మీటర్ కిందనే విద్యుత్ సరఫరా చేయాలని, ఆక్యుపెన్సీ సర్టిఫికెట్‌తోనే పని ఉండాలని BJP డిమాండ్ చేస్తోంది.
2. అనుమతి లేకపోతే మీటర్ ఇవ్వడం లేదు: సాయి నగర్ కాలనీలో 118 GO అమల్లో ఉంది. కొంతమంది కన్వీనియన్స్ డీడీ తహసీల్దార్ దగ్గర చేసుకున్నారు. మిగతా వారు ఆర్థిక సమస్యల వల్ల చేసుకోలేకపోయారు. కన్వీనియన్స్ డీడీ చేసుకోకపోవడంతో ఇంటి నిర్మాణానికి అనుమతి ఇవ్వడం లేదు. దీనితో విద్యుత్ మీటర్లు కూడా ఇవ్వకపోవడంతో ఆ కాలనీ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అనుమతితో సంబంధం లేకుండా మీటర్ ఇవ్వాలని BJP డిమాండ్ చేస్తోంది.
3. అపార్ట్మెంట్లకు అన్యాయం: గత మూడు నెలలుగా ఒక్కో అపార్ట్మెంట్‌కు 20 లక్షల నుండి 2 కోట్ల వరకు ఫీజులు తీసుకొని, అపార్ట్మెంట్లకు 11 KV ద్వారా సరఫరా ఇవ్వకుండా వీధిలోని పబ్లిక్ విద్యుత్ లైన్ ద్వారా సప్లై ఇస్తున్నారు. బిత్తిరి సరఫరా చేసే ఫీడర్ 1100 ఓల్డ్ 11 KV నుండి ఇవ్వాల్సిన కనెక్షన్లు 200 వోల్ట్స్ సింగిల్ ఫేజ్ ద్వారా సప్లై చేస్తున్నారు. దీనితో అధిక విద్యుత్ లోడ్ పడి కాలనీలో విద్యుత్ అంతరాయాలు విపరీతంగా జరుగుతున్నాయి. తక్షణమే 11 KV లైన్ ద్వారానే అపార్ట్మెంట్లకు, ట్రాన్స్ఫార్మర్లకు ఏర్పాటు చేసి బిత్తిరి సప్లై చేయాలని BJP డిమాండ్ చేస్తోంది.
4. భాగ్యనగరానికి అండర్ గ్రౌండ్ విద్యుత్ కేబుల్: ప్రస్తుతం ఉన్న ఓవర్ హెడ్ లైన్ల వల్ల ప్రజలకు, రవాణాకు ముప్పుగా మారుతోంది. చెట్లు తగులుతుండటంతో ప్రతి సంవత్సరం కొట్టివేస్తున్నారు. నరికిన చెట్లను నెలల తరబడి రోడ్డుపైనే ఉంచడంతో ప్రజలకు రాకపోకలకు ఇబ్బందులున్నాయి. భాగ్యనగరంలో స్వచ్ఛమైన వాతావరణం కోసం అండర్ గ్రౌండ్ కేబుల్ లైన్ ఏర్పాటు శరణ్యమని BJP భావిస్తోంది. కేంద్ర ప్రభుత్వ RDSS పథకంతో వేల కోట్ల రూపాయలతో అండర్ గ్రౌండ్ విద్యుత్ కేబుల్ వ్యవస్థను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తోంది. మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్‌లో రాబోయే BJP మేయర్ ఆధ్వర్యంలో అండర్ గ్రౌండ్ కేబుల్ ఏర్పాటు చేసి కరెంటు పోల్స్‌కు స్వస్తి పలుకుతామని సామ రంగారెడ్డి తెలిపారు.




