Medchal: రోడ్డు ప్రమాద బాధితుడి మృతి: సంప్రదా హాస్పిటల్ వద్ద ఉద్రిక్తత
Medchal: రూ.20 లక్షలు ఫీజు వసూలు చేసి, మృతదేహం కోసం మరో రూ.5 లక్షలు అడగటంతో మృతుడి బంధువులు, గ్రామస్థులు ఆసుపత్రి ఎదుట ఆందోళనకు దిగారు.
Medchal: రోడ్డు ప్రమాద బాధితుడి మృతి: సంప్రదా హాస్పిటల్ వద్ద ఉద్రిక్తత
మేడ్చల్: మేడ్చల్ పట్టణంలోని సంప్రదా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మేడ్చల్ కాలకాల్ కు చెందిన అజయ్ కుమార్ 22 మృతి, రోడ్డు ప్రమాదం జరిగి 20 రోజులు అవుతున్న చికిత్స చేస్తున్నామని తెలిపిన ఆసుపత్రి యాజమాన్యం ఇప్పటికే రూ,20 లక్షల వరకు ఫీజు వసూలు చేసారని కుటుంబ సభ్యుల ఆగ్రహం గత 20 రోజుల నుండి చికిత్స పట్ల కనీస సమాచారం కూడా ఇవ్వలేదని బంధువుల అందోళన.
యువకుడికి చికిత్స చేస్తుండగా ఈ రోజు చనిపోయినట్లు తెలిపిన ఆసుపత్రి సిబ్బంది, ఇంకా 5 లక్షలు చెల్లించి డెడ్ బాడీ ని తీసుకెళ్లాలని హోస్పాటల్ సిబ్బంది హుకుం జారీ చేయడంతో హాస్పిటల్ ముందు మృతుడి బంధువుల ఆందోళన, బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని హాస్పిటల్ ముందు బైటయించిన గ్రామస్థులు.
Next Story




