Sanathnagar: సనత్‌నగర్‌లో ఇందిరమ్మ చీరల పంపిణీ.. కోట నీలిమ!

Sanathnagar: మహిళల ఆత్మగౌరవాన్ని పెంచే లక్ష్యంతో తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ చీరల పంపిణీ చేపట్టిందని పీసీసీ వైస్ ప్రెసిడెంట్, కోట నీలిమ తెలిపారు.

RAJESH,	WEST ZONE
Published on: 23 Jun 2026 3:49 PM IST
Sanathnagar
X

Sanathnagar: సనత్‌నగర్‌లో ఇందిరమ్మ చీరల పంపిణీ.. కోట నీలిమ!

Sanathnagar: తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం మహిళల ఆత్మగౌరవాన్ని పెంచే లక్ష్యంతో ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహిస్తోందని పీసీసీ వైస్ ప్రెసిడెంట్, సనత్ నగర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి డాక్టర్ కోట నీలిమ తెలిపారు. సనత్ నగర్ డివిజన్ లోని స్పోర్ట్స్ కాంప్లెక్స్ లో డీసీ సుజాత, డీపీవో మాలతి, సివో మన్నయ్యతో కలిసి స్థానిక మహిళలకు ఇందిరమ్మ చీరలు పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా డాక్టర్ కోట నీలిమ మాట్లాడుతూ.. రాష్ట్రలోని ప్రతి మహిళకు చీర అందించాలని ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మహిళల అభ్యున్నతికి తమ ప్రభుత్వం ఎనలేని ప్రాధాన్యత ఇస్తోందని అన్నారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలనే సంకల్పంతో అనేక కార్యక్రమాలు అమలు చేస్తోందని గుర్తు చేశారు.

అర్హులైన ప్రతీ మహిళకు ఇందిరమ్మ చీరలు పంపిణీ అయ్యేలా పారదర్శకంగా ప్రణాళికాబద్దంగా కృషి చేయాలని అధికారులకు సూచించారు. కుటుంబ అభ్యున్నతిలో మహిళలే కీలకమని, భవిష్యత్ తరాల బాగు కోసం పిల్లలను చక్కగా చదివించాలని హితువు పలికారు.

కాంగ్రెస్ ప్రభుత్వంలో రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల వంటివి మహిళల పేరుతోనే మంజూరు చేస్తున్నారని, వారి అభ్యున్నతికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందన్నారు. అర్హులైన వారందరికీ చీరలు పంపిణీ జరుగుతుందని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో డివిజన్ ప్రెసిడెంట్ మహమ్మద్ అజ్జు, రవికాంత్, ప్రమోద్, అడ్డుతో పాటు పలువురు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

RAJESH,	WEST ZONE

RAJESH, WEST ZONE

Next Story