Ghatkesar: తీవ్ర దుర్గంధం.. ఘట్‌కేసర్ సర్కిల్ ఆఫీసులో ప్రజల అవస్థలు

Ghatkesar: మల్కాజిగిరి నగరపాలక సంస్థ పరిధిలోని ఘట్‌కేసర్ మున్సిపల్ సర్కిల్ కార్యాలయంలో పారిశుధ్య లోపంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

KARUNAKAR, UPPAL
Published on: 27 April 2026 6:51 PM IST
Ghatkesar
X

Ghatkesar: తీవ్ర దుర్గంధం.. ఘట్‌కేసర్ సర్కిల్ ఆఫీసులో ప్రజల అవస్థలు

Ghatkesar: మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా మల్కాజిగిరి నగరపాలక సంస్థ పరిధిలోని ఘట్‌కేసర్ మున్సిపల్ సర్కిల్ కార్యాలయంలో పారిశుధ్య లోపం రాజ్యమేలుతోంది. ఘట్ కేసర్ మున్సిపల్ డిప్యూటీ కమిషనర్ కార్యాలయం లో వివిధ పనుల నిమిత్తం ఘట్‌కేసర్, ఎదులాబాద్, పోచారం, నాగారం డివిజన్ల నుండి వచ్చే ప్రజల కోసం సరైన వసతుల లేమితో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

ముఖ్యంగా టాయిలెట్లలో పరిశుభ్రత లేకపోవడం, దుమ్ము పేరుకుపోవడం, తీవ్ర దుర్గంధం తో పాటు దుర్వాసన వస్తోందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కార్యాలయ ప్రాంగణంలో డీసీ ఛాంబర్ వెనుక చెత్త, ప్లాస్టిక్ గ్లాసులు పేరుకుపోవడం పరిస్థితికి అద్దం పడుతుంది. సాక్షాత్తు డిప్యూటీ కమిషనర్ కార్యాలయంలోనే ఇలాంటి పరిస్థితి ఉంటే,

సర్కిల్ పరిధిలోని ఘట్‌కేసర్, ఎదులాబాద్, పోచారం, నాగారం డివిజన్లలో పారిశుధ్య పరిస్థితి ఎలా ఉంటుందోనని ప్రజలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మల్కాజిగిరి నగరపాలక సంస్థ అభివృద్ధిలో ముందుకు వెళ్లాలంటే ముందుగా డీసీ కార్యాలయం నుండి మొదలుపెట్టి ప్రతి సర్కిల్, ప్రతి డివిజన్‌ లో పరిశుభ్రత, నిర్వహణ మెరుగుపరచాల్సిన అవసరం ఉందని స్థానికులు అభిప్రాయ పడుతున్నారు.

KARUNAKAR, UPPAL

KARUNAKAR, UPPAL

Next Story