Hyderabad: నాగోల్ సర్కిల్ ఆఫీస్ వద్ద ఉద్రిక్తత.. విధుల బహిష్కరణ
Hyderabad: మల్కాజ్‌గిరి మున్సిపాలిటీ పెద్ద అంబర్‌పేట్ జోన్ పరిధిలోని నాగోల్ సర్కిల్ కార్యాలయం వద్ద పారిశుద్ధ్య కార్మికులు భారీ ఆందోళన చేపట్టారు.
Hyderabad: నాగోల్ సర్కిల్ ఆఫీస్ వద్ద ఉద్రిక్తత.. విధుల బహిష్కరణ
హైదరాబాద్: మల్కాజ్ గిరి మున్సిపాలిటీ జోన్ పెద్ద అంబర్పేట్ లో ఉన్న నాగోల్ సర్కిల్ కార్యాలయం ఎదుట మున్సిపల్ పారిశ్యుద్ద కార్మికులు ఆందోళనకు దిగారు. గత రెండు నెలలుగా జీతాలు రాక గత ఎనిమిది నెలలుగా పెంచిన జీతాలు, పీఎఫ్ చెల్లింపులు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని కార్మికులుగా తమకి ఇవ్వాల్సిన చీపుర్లు, నూనె, షూస్ మరియు సేఫ్టీ జాకెట్స్ కూడా అధికారులు ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.ఈ ఆందోళన చేస్తున్న కార్మికులకి సీఐటీయూ నాయకులు మద్దతుగా ఆందోళన లో పాల్గొన్నారు.
విధులు నిర్వహించేందుకు అవసరమైన సరైన వసతులు కూడా కల్పించలేని అధికారులు 6 నెలలుగా కాలయాపన చేస్తున్నారని ఆరోపించారు. పలుమార్లు అధికారులకు వినతులు ఇచ్చినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని కార్మికులు మండిపడ్డారు. “ఎంత మంది కమిషనర్లు మారినా మా సమస్యలు మాత్రం మారడం లేదు ప్రభుత్వం కూడా పట్టించుకోవడం లేదు. మేమేం చేయాలి” అంటూ కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు.
పెద్ద అంబర్‌పేట్ ప్రాంతంలో సుమారు 200 మంది మున్సిపాలిటీ శానిటేషన్ సిబ్బంది విధులు బహిష్కరించడంతో పారిశుద్ధ్య పనులు నిలిచిపోయాయి. దీంతో స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.తమ సమస్యలను వెంటనే పరిష్కరించకపోతే సోమవారం నుండి ఆందోళన ఉదృతం చేస్తామని హెచ్చరించారు కార్మికులు.




