Hayathnagar: అనాజ్‌పూర్‌లో ఘనంగా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి వేడుకలు
Hayathnagar: హయత్ నగర్ నియోజకవర్గం అనాజ్‌పూర్‌లో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 376వ జయంతి. పాపన్న చిత్రపటానికి నివాళులర్పించిన మార్కెట్ కమిటీ చైర్మన్ మధుసూదన్ రెడ్డి.
Hayathnagar: అనాజ్‌పూర్‌లో ఘనంగా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి వేడుకలు
Hayathnagar: గెరిల్లా పోరాటంతో దళిత, బహుజనుల రాజకీయ, సామాజిక సమానత్వం కోసం కృషి చేసిన గొప్ప యుద్ధ వీరుడు, నిరంకుశత్వంపై నిప్పుకణికలా పోరాడిన సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 376వ జయంతి వేడుకలను అనాజ్‌పూర్ గ్రామంలో ఘనంగా నిర్వహించారు.
అనాజ్‌పూర్ గ్రామ గౌడ సంఘం అధ్యక్షులు తాటిపల్లి విష్ణు గౌడ్ ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ చిత్రపటానికి గడ్డి అన్నారం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ చిలుక మధుసూదన్ రెడ్డి పుష్పాంజలి ఘటించి ఘన నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ చేసిన పోరాటాలు, సమాజంలో సమానత్వం కోసం ఆయన అందించిన సేవలను స్మరించుకున్నారు.ఈ కార్యక్రమంలో అనాజ్‌పూర్ గ్రామ గౌడ సంఘం పెద్దలు, గ్రామ పెద్దలు, తదితరులు పాల్గొన్నారు.




