Hyderabad: సరూర్‌నగర్‌లో దారుణం కిందపడినట్లు నటించి రూ.లక్ష ఫోన్ చోరీ
Hyderabad: హైదరాబాద్ సరూర్‌నగర్‌లో దృష్టి మరల్చి దొంగతనం. కిందపడినట్లు నమ్మించి సహాయం చేయబోయిన వ్యక్తి నుండి రూ. 1 లక్ష ఖరీదైన మొబైల్ చోరీ. సీసీటీవీ దృశ్యాలు లభ్యం.
Hyderabad: సరూర్‌నగర్‌లో దారుణం కిందపడినట్లు నటించి రూ.లక్ష ఫోన్ చోరీ
హైదరాబాద్: కిందపడినట్లు నమ్మించి ఓ వ్యక్తి దృష్టి మరల్చిన ఇద్దరు దుండగులు, అతని ఖరీదైన మొబైల్ ఫోన్‌ను అపహరించి పరారైన ఘటన సరూర్‌నగర్‌లో చోటుచేసుకుంది.
సీసీ కెమెరా కథనం ప్రకారం, ఇద్దరు వ్యక్తులు నంబర్ ప్లేట్ లేని బైక్‌పై వచ్చి ఉద్దేశపూర్వకంగా కిందపడినట్లు నటించారు. వారిని చూసిన ఓ వ్యక్తి సహాయం చేసేందుకు ముందుకు వెళ్లగా, ఆ అవకాశాన్ని వినియోగించుకున్న దుండగులు సుమారు రూ.1 లక్ష విలువైన మొబైల్ ఫోన్‌ను క్షణాల్లో అపహరించారు.
అనంతరం అదే బైక్‌పై వేగంగా అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఈ ఘటన సమీపంలోని సీసీటీవీ కెమెరాలో రికార్డైంది. సీసీటీవీ దృశ్యాల ఆధారంగా దుండగులను గుర్తించేందుకు పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
Next Story




