Saroornagar: సరూర్ నగర్ పోచమ్మ గుడిలో దొంగతనం కేసు క్లోజ్

Saroornagar: హైదరాబాద్ సరూర్ నగర్ సరస్వతి నగర్ కాలనీలోని పోచమ్మ దేవాలయంలో జరిగిన చోరీ కేసును పోలీసులు ఛేదించారు.

RAHUL, MEERPET
Published on: 19 July 2026 12:15 PM IST
Saroornagar
X

Saroornagar: సరూర్ నగర్ పోచమ్మ గుడిలో దొంగతనం కేసు క్లోజ్

హైదరాబాద్: సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సరస్వతి నగర్ కాలనీలోని పోచమ్మ దేవాలయంలో ఇటీవల జరిగిన చోరీ కేసును సరూర్ నగర్ పోలీసులు ఛేదించారు.

మహబూబాబాద్ జిల్లాకు చెందిన బూర్ల అనిల్ (27)ను అరెస్టు చేసి, అతని వద్ద నుంచి అమ్మవారి బంగారు పుస్తెలు, వెండి వస్తువులు, హుండీ నగదును స్వాధీనం చేసుకున్నారు.

ఆన్‌లైన్ బెట్టింగ్ వ్యసనంతో అప్పుల పాలైన నిందితుడు డబ్బు కోసం అర్ధరాత్రి దేవాలయం తాళం పగులగొట్టి, సీసీటీవీ వైర్లు కత్తిరించి చోరీకి పాల్పడినట్లు విచారణలో వెల్లడైంది.

సాంకేతిక ఆధారాలు, సీసీటీవీ ఫుటేజ్, శాస్త్రీయ ఆధారాలతో నిందితుడిని గుర్తించి అరెస్టు చేసిన పోలీసులు, అతడిని కోర్టులో హాజరుపరచి రిమాండ్‌కు తరలించారు.

ఈ కేసును త్వరితగతిన ఛేదించిన సిబ్బందిని ఉన్నతాధికారులు అభినందించడం జరిగింది.

RAHUL, MEERPET

RAHUL, MEERPET

Next Story