Kadthal: నల్ల పోచమ్మ ఆలయంలో సర్పంచ్ గోపాల్ ప్రత్యేక పూజలు!
Kadthal: రావిచేడ్‌లో బోనాల పండుగ సందర్భంగా నల్ల పోచమ్మ ఆలయంలో సర్పంచ్ బొప్పిడి గోపాల్ కుటుంబ సమేతంగా పట్టువస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
Kadthal: నల్ల పోచమ్మ ఆలయంలో సర్పంచ్ గోపాల్ ప్రత్యేక పూజలు!
కడ్తాల్: రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండలం పోచమ్మ తల్లి దీవెనలు రావిచేడ్ గ్రామ ప్రజలందరిపై ఉండాలని వేడుకున్నట్లు జిల్లా సర్పంచుల సంఘం ఉపాధ్యక్షుడు రావిచేడ్ సర్పంచ్ బొప్పిడి గోపాల్ పేర్కొన్నారు.. సోమవారం కడ్తాల్ మండలం రావిచేడ్ గ్రామంలో బోనాల పండుగ సందర్భంగా నల్ల పోచమ్మ తల్లి అమ్మవారిని జిల్లా సర్పంచుల సంఘం ఉపాధ్యక్షుడు రావిచేడ్ సర్పంచ్ బొప్పిడి గోపాల్ తన కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు.
అమ్మవారికి పట్టు వస్త్రాలు ఒడిబియ్యం సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వర్షాలు సమృద్ధిగా కురిసి రైతులు పాడిపంటలతో విలసిల్లాలని అమ్మవారిని మనస్ఫూర్తిగా కోరుకున్నట్లు సర్పంచ్ గోపాల్ తెలిపారు. కార్యక్రమంలో వార్డు సభ్యులు భూపతి, అనిల్, సరిత, నాయకులు శ్రీశైలం యాదవ్, పాండు, సాయికుమార్, కృష్ణయ్య, బీరప్ప, యువకులు ప్రశాంత్, రాజు, వంశీ, రాఘవేందర్, తదితరులున్నారు.




