Julapally: మృతురాలి అంత్యక్రియలకు గ్రామ సర్పంచ్, యువత రూ.20 వేల ఆర్థిక సాయం!
Julapally: జూలపల్లిలో మానవత్వం చాటుకున్న గ్రామ పాలకవర్గం, యువత. గుండెపోటుతో మృతిచెందిన పాఠ్లావత్ ఉనెమ్మ కుటుంబానికి రూ.20 వేల ఆర్థిక సాయం అందజేశారు.
Julapally: మృతురాలి అంత్యక్రియలకు గ్రామ సర్పంచ్, యువత రూ.20 వేల ఆర్థిక సాయం!
జూలపల్లి: రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం జూలపల్లి గ్రామపంచాయతీ గ్రామంలో * 8వ వార్డుకు చెందిన *పాఠ్లావత్ ఉనెమ్మ* గుండెపోటుతో మృతి చెందడంతో గ్రామంలో విషాదం నెలకొంది. ఆమె అంత్యక్రియలకు అండగా నిలిచేందుకు గ్రామ సర్పంచ్ కడారి శేఖర్ యాదవ్, డిప్యూటీ సర్పంచ్ ఇంద్రకంటి శ్రీశైలం గౌడ్, వార్డు సభ్యులు, గ్రామ యువత కలిసి *రూ.20,000 ఆర్థిక సాయం* అందించారు.
ఈ 20000 ఆర్థిక సాయం మృతురాలు భర్తకి *లస్కర్ నాయక్*కు అందజేశారు. ఈ సందర్భంగా సర్పంచ్, డిప్యూటీ సర్పంచ్, వార్డు సభ్యులు, యువత మాట్లాడుతూ ఉనెమ్మ కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, ఆపదలో ఉన్న కుటుంబాలకు ఎల్లప్పుడూ తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు.
గ్రామ ప్రజలు సర్పంచ్, డిప్యూటీ సర్పంచ్, వార్డు సభ్యులు, యువత చేసిన సహాయాన్ని అభినందించారు. *మృతురాలి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థించారు.




