Rangareddy: పాఠశాల సమస్యపై స్పందించిన సర్పంచ్.. చదును చేసిన ఆవరణ!

Rangareddy: తలకొండపల్లి మండలం హర్యానాయక్ తండాలో ప్రాథమిక పాఠశాల ఆవరణను సర్పంచ్ కోర్ర శిరీష కృష్ణ నాయక్ చదును చేయించి విద్యార్థుల ఇబ్బట్లు తొలగించారు.

SRI SAILAM, KALWAKURTHY
Published on: 8 Aug 2026 1:57 PM IST
Rangareddy
X

Rangareddy: పాఠశాల సమస్యపై స్పందించిన సర్పంచ్.. చదును చేసిన ఆవరణ!

Rangareddy: రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలంలోని హర్యానాయక్ తండాలో ప్రాథమిక పాఠశాల పరిస్థితులను హర్యానాయక్ తండా సర్పంచ్ కోర్ర శిరీష కృష్ణ నాయక్ శనివారం పరిశీలించారు. ప్రాథమిక పాఠశాల మెయిన్ రోడ్డుకు 10 ఫీట్లు దిగువన ఉండడం వలన వర్షాకాలంలో నీరు నిలువ అయి విద్యార్థుల రాకపోకలకు అవస్థలు పడుతున్నారు ఈ విషయాన్ని ఉపాధ్యాయుల ద్వారా విషయం తెలుసుకున్న గ్రామ సర్పంచ్ కోర్ర శిరీష కృష్ణ నాయక్ పాఠశాల ఆవరణంలో మట్టి పనులు, ఆట స్థలం చదును పనులను స్వయంగా చేపట్టారు .

వర్షాకాలంలో విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా పాఠశాలను చదను చేయడం వల్ల గ్రామస్తులు ఉపాధ్యాయులు సర్పంచ్ కు అభినందనలు తెలిపారు.పాఠశాలలో విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు గ్రామ పంచాయతీ తరపున అన్ని విధాలా సహకారం అందిస్తామని సర్పంచ్ కోర్ర శిరీష కృష్ణ నాయక్ తెలిపారు. తాగునీరు, మరుగుదొడ్లు, ఫర్నిచర్ వంటి అవసరాలను దశలవారీగా పూర్తి చేస్తామన్నారు.

విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా పాఠశాల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తున్నామని, గ్రామంలోని ప్రతి పిల్లవాడు చదువుకోవాలని కోరారు. తల్లిదండ్రులు కూడా పిల్లల చదువుపై శ్రద్ధ పెట్టాలని సూచించారు.ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ రమేష్ వార్డు సభ్యులు దశరథం శారద పంతు వెంకటేష్ నాయకులు వెంకటేష్ నవీన్ తదితరులు పాల్గొన్నారు.

SRI SAILAM, KALWAKURTHY

SRI SAILAM, KALWAKURTHY

Next Story