Talakondapally: పంచముఖ ఆంజనేయస్వామి ఆలయ నిర్మాణానికి రూ.51 వేల విరాళం అందజేత!

Talakondapally: తలకొండపల్లి మండలం గౌరిపల్లిలో నిర్మిస్తున్న శ్రీ పంచముఖ ఆంజనేయస్వామి ఆలయ నిర్మాణానికి రూ.51 వేల ఆర్థిక సాయం అందజేసిన పడకల్ సర్పంచ్ సునీత ప్రభాకర్ రెడ్డి.

Pranathi Sri
Published on: 9 Oct 2026 7:42 AM IST
Talakondapally
X

Talakondapally: పంచముఖ ఆంజనేయస్వామి ఆలయ నిర్మాణానికి రూ.51 వేల విరాళం అందజేత!

Talakondapally: తలకొండపల్లి మండలంలోని గౌరిపల్లి గ్రామంలో నిర్మిస్తున్న శ్రీ పంచముఖ ఆంజనేయస్వామి ఆలయ నిర్మాణానికి పడకల్ గ్రామ సర్పంచ్ సునీత ప్రభాకర్ రెడ్డి రూ.51 వేల విరాళాన్ని అందజేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ సునీత ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ.. ఆలయ నిర్మాణంలో తనవంతు సహకారం అందించడం సంతోషంగా ఉందన్నారు.

ఆధ్యాత్మిక కార్యక్రమాలు గ్రామాల్లో ఐక్యత, భక్తిభావాన్ని పెంపొందించడంతో పాటు ప్రజలకు ఆధ్యాత్మిక ప్రశాంతతను అందిస్తాయని పేర్కొన్నారు. ఆలయ నిర్మాణం విజయవంతంగా పూర్తికావాలని, శ్రీ పంచముఖ ఆంజనేయస్వామి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని ఆకాంక్షించారు.

ఆలయ నిర్మాణానికి విరాళం అందించిన సునీత ప్రభాకర్ రెడ్డికి ఈ సందర్భంగా గ్రామస్థులు, ఆలయ నిర్మాణ కమిటీ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు గౌరీపల్లి గ్రామ సర్పంచ్ కళ్యాణ్ నాయక్ మాజీ సర్పంచ్ నరేందర్ గౌడ్ ఉప సర్పంచ్ రమేష్ యాదవ్ ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు

Pranathi Sri

Pranathi Sri