Uppal: మినీ శిల్పారామంలో వీకెండ్ సందడి.. ప్రేక్షకులు ఫిదా!
Uppal: హైదరాబాద్ ఉప్పల్ మినీ శిల్పారామంలో వారాంతపు సాంస్కృతిక వేడుకల్లో భాగంగా నిర్వహించిన కూచిపూడి నృత్య ప్రదర్శన కళాభిమానులను మంత్రముగ్ధులను చేసింది.
Uppal: మినీ శిల్పారామంలో వీకెండ్ సందడి.. ప్రేక్షకులు ఫిదా!
Uppal: నగరంలోని ఉప్పల్ మినీ శిల్పారామంలో కొనసాగుతున్న వారాంతపు సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా నిర్వహించిన కూచిపూడి నృత్య ప్రదర్శన ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది. శ్రీమతి శర్వాణి ప్రియా గారి శిష్య బృందం ప్రదర్శించిన సాంప్రదాయ నృత్యాలు కళాభిమానులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
భారతీయ సాంప్రదాయ కళకు ప్రతీకగా నిలిచే కూచిపూడి నృత్యంలో చిన్నారులు అద్భుతమైన హావభావాలు, లయబద్ధమైన అడుగులు, సమన్వయంతో తమ ప్రతిభను చాటుకున్నారు. శుద్ధ బ్రహ్మ, ఒకపరి కొకపరి, జనుత శబ్దం, వెడలెరా వయ్యారులు, పుష్పాంజలి, మహేశ్వరి మహంకాళి వంటి నృత్య రూపకాలను అందంగా ఆవిష్కరించి ప్రేక్షకుల మన్ననలు పొందారు.
ఈ సందర్భంగా దేవంశీ, అన్విక, మాన్విత, సాన్విత, శ్రీ చైత్ర, దివ్య, శ్రీ సంజన, సహస్రిత, సాన్విత, నవ్య శ్రీ, శాన్విక, బహులీక తదితర చిన్నారులు తమ నృత్య ప్రతిభతో ఆకట్టుకున్నారు. సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడుతూ యువతలో కళల పట్ల ఆసక్తిని పెంపొందించేలా శిల్పారామం నిర్వహిస్తున్న కార్యక్రమాలు అభినందనీయమని సందర్శకులు పేర్కొన్నారు. చిన్నారుల ప్రదర్శనకు ప్రేక్షకుల నుంచి కరతాళ ధ్వనులతో అభినందనలు లభించాయి.




