Ghatkesar: ప్రభుత్వ హాస్టలే విద్యార్థులకు బంగారు బాట!
Ghatkesar: ఘట్‌కేసర్‌లో ప్రభుత్వ ‘హాస్టల్ బాట’ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది.
Ghatkesar: ప్రభుత్వ హాస్టలే విద్యార్థులకు బంగారు బాట!
Ghatkesar: మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో సంక్షేమ వారోత్సవాల భాగంగా ఘట్‌కేసర్ లో ‘హాస్టల్ బాట’ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమం తల్లిదండ్రుల్లో మంచి స్పందనను రాబట్టింది. జిల్లా ఎస్సీ డెవలప్మెంట్ అధికారి జీ. వినోద్ కుమార్ స్వయంగా ఎస్సీ బస్తీలకు వెళ్లి, అక్కడి తల్లిదండ్రులతో మాట్లాడారు.
ప్రభుత్వ హాస్టళ్లలో అందిస్తున్న నాణ్యమైన విద్య, సురక్షిత వసతి, పోషకాహారం, ఇతర సదుపాయాల గురించి వివరించి, తమ పిల్లలను హాస్టళ్లలో చేర్పించాలని కోరారు. మీ పిల్లల ప్రగతికి హాస్టల్ బాట నిజమైన బంగారు బాటఅని ఆయన పేర్కొన్నారు. అధికారుల సూచనలకు స్పందించిన తల్లిదండ్రులు, తమ పిల్లల భవిష్యత్తు కోసం హాస్టళ్లలో చేర్పించేందుకు ఆసక్తి చూపారు.
ప్రభుత్వంపై నమ్మకం వ్యక్తం చేస్తూ, ఈ అవకాశాన్ని వినియోగించుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ ఎస్సీ డెవలప్మెంట్ ఆఫీసర్ గోపీచంద్, హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్లు ధాన్య నాయక్, కాంతి రెడ్డి మహేష్, లక్ష్మయ్య, కృష్ణ, ఊర్మిళతో పాటు విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.
ఈ ‘హాస్టల్ బాట’ కార్యక్రమం ద్వారా గ్రామీణ, పేద విద్యార్థులకు మెరుగైన విద్యావకాశాలు కల్పించి, వారి భవిష్యత్తును వెలుగులోకి తీసుకురావడమే ప్రభుత్వ లక్ష్యంగా అధికారులు తెలిపారు.




