Hyderabad: జిల్లెలగూడలో స్కూల్ బస్సు ప్రమాదం.. తృటిలో పెను ముప్పు తప్పింది!

Hyderabad: మీర్‌పేట్ పరిధిలోని జిల్లెలగూడలో తృటిలో తప్పిన బస్సు ప్రమాదం డ్రైవర్‌కు బీపీ తగ్గి డివైడర్‌ను ఢీకొట్టిన పల్లవి మోడల్ స్కూల్ బస్సు, విద్యార్థులు క్షేమం.

RAHUL, MEERPET
Published on: 28 Sept 2026 5:03 PM IST
Hyderabad
X

Hyderabad: జిల్లెలగూడలో స్కూల్ బస్సు ప్రమాదం.. తృటిలో పెను ముప్పు తప్పింది!

హైదరాబాద్: హైదరాబాద్ కమిషనరేట్ మీర్‌పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జిల్లెలగూడ ప్రధాన రహదారిపై TG 10 G 1079 నెంబర్ గల స్కూల్ బస్సు ప్రమాదానికి గురైంది. అల్వాల్‌కు చెందిన పల్లవి మోడల్ స్కూల్ ప్రైవేట్ బస్సు 17 మంది విద్యార్థులతో స్కూల్ నుంచి బయలుదేరింది. అల్మాస్గూడ లో 15 మంది విద్యార్థులను దించి జిల్లెలగూడ లలిత నగర్ ఎక్స్ రోడ్ వద్దకు చేరుకోగానే బస్సు డ్రైవర్‌కు ఒక్కసారిగా బీపీ తక్కువై స్పృహ కోల్పోవడంతో బస్సు అదుపుతప్పి రోడ్డుమధ్యలో ఉన్న డివైడర్‌ను ఢీకొట్టింది.

ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో ఇద్దరు టీచర్లు, ఒక స్కూల్ ఆయా, ఇద్దరు పిల్లలు, డ్రైవర్ మాత్రమే ఉన్నారు. ఈ ఘటనలో డ్రైవర్‌కు స్వల్ప గాయాలయ్యాయి. ఘటనపై మీర్‌పేట్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

RAHUL, MEERPET

RAHUL, MEERPET