Moinabad: లోటస్ పాండ్ పార్కులో విషాదం.. ఉయ్యాల తగిలి విద్యార్థి మృతి!

Moinabad: మొయినాబాద్ లోటస్ పాండ్ పార్కులో విహారయాత్ర సందర్భంగా ఉయ్యాల తగిలి 4వ తరగతి విద్యార్థి తమ్ము అభిరామ్ (10) మృతిచెందగా, మరో విద్యార్థి యశ్వంత్ (12) గాయపడ్డాడు.

RAGHAVENDRA, CHEVELLA
Published on: 22 Nov 2026 11:07 AM IST
Moinabad
X

Moinabad: లోటస్ పాండ్ పార్కులో విషాదం.. ఉయ్యాల తగిలి విద్యార్థి మృతి!

Moinabad: నార్సింగిలోని హ్యాపీ స్కాలర్స్ పాఠశాలకు చెందిన విద్యార్థులు విద్యా విహారయాత్రలో భాగంగా, మొయినాబాద్‌లోని గురుకుల్ పాఠశాల పక్కన ఉన్న లోటస్ పాండ్ పార్కును సందర్శించారు.

ఈ సందర్భంగా విద్యార్థులు పార్కులోని ఉయ్యాలపై ఆడుకుంటుండగా, ఉయ్యాలను అధిక వేగంతో ఊపడంతో అది ప్రమాదవశాత్తు వెనుక వైపునకు వచ్చి ఇద్దరు విద్యార్థులను బలంగా ఢీకొట్టింది. దీంతో ఇద్దరు విద్యార్థులకు గాయాలయ్యాయి.

మృతిచెందిన విద్యార్థిని తమ్ము అభిరామ్, తండ్రి శివ శంకరరావు, వయస్సు 10 సంవత్సరాలు, 4వ తరగతి చదువుతున్నాడు. నివాసం మణికొండ. స్వస్థలం రొయ్యూరు గ్రామం, తోట్లవల్లూరు మండలం, కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం.

మరో గాయపడిన విద్యార్థిని టి. యశ్వంత్, తండ్రి రాజు, వయస్సు 12 సంవత్సరాలుగా గుర్తించారు.

గాయపడిన ఇద్దరు విద్యార్థులను వెంటనే చికిత్స నిమిత్తం భాస్కర ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు పరీక్షించి తమ్ము అభిరామ్ అప్పటికే మృతిచెందినట్లు నిర్ధారించారు. మరో విద్యార్థి టి. యశ్వంత్‌కు గాయాలు కావడంతో వైద్య చికిత్స అందించారు.

RAGHAVENDRA, CHEVELLA

RAGHAVENDRA, CHEVELLA