Secunderabad: కంటోన్మెంట్ బీఆర్ఎస్ మీటింగ్‌కు కేటీఆర్!
Secunderabad: ఈ నెల 31న బాలంరాయ్ క్లాసిక్ గార్డెన్‌లో కంటోన్మెంట్ బీఆర్ఎస్ శిక్షణా శిబిరం.
Secunderabad: కంటోన్మెంట్ బీఆర్ఎస్ మీటింగ్‌కు కేటీఆర్!
సికింద్రాబాద్: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన సర్ ఓటర్ నమోదు తోపాటు బి ఆర్ ఎస్ మెంబర్ షిప్ సభ్యత్వ నమోదు శిక్షణా శిబిరంలో బి ఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్ పాల్గొంటారని కంటోన్మెంట్ బి ఆర్ ఎస్ మెంబర్ షిప్ ఇంచార్జ్ మన్నె క్రిశాంక్ తెలిపారు..బాలం రాయ్ క్లాసిక్ గార్డెన్ లో ఈ నెల 31 వ తేదీన కంటోన్మెంట్ నియోజకవర్గంలోని ఏడు వార్డులు ఓ డివిజన్ లో ఉన్న బూత్ లెవెల్ స్థాయి ముఖ్య నాయకులతో శిక్షణా శిబిరాన్నీ నిర్వహించనున్నట్లు తెలిపారు.
అందులోకేటిఆర్ దిశా నిర్దేశం చేయనున్నట్లు క్రిశాంక్ తెలిపారు…సర్ ఓటర్ నమోదు..బి ఆర్ ఎస్ మెంబర్ షిప్ నమోదు పై కెసిఆర్ ఆదేశాల మేరకు అన్ని నియోజవర్గాల్లో ఈ కార్యక్రమాలు జరుగుతున్నట్లు బి ఆర్ ఎస్ నాయకులు తెలిపారు..కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని అబద్దాలే తప్ప ఆరు గ్యారంటీల అమలపై చిత్తశుద్ధి లేదని బి ఆర్ ఎస్ నేతలు ఆరోపించారు.




