Bowenpally: బోయిన్‌పల్లిలో ఎమ్మెల్యే శ్రీగణేష్ ఆకస్మిక తనిఖీ

Bowenpally: బోయిన్‌పల్లి మార్కెట్ - అంబేద్కర్ నగర్ రోడ్డులో ట్రాఫిక్ సమస్యలపై కంటోన్మెంట్ ఎమ్మెల్యే బుధవారం అధికారులతో కలిసి క్షేత్రస్థాయి పరిశీలన చేశారు.

Srikanth, Secunderabad
Published on: 27 May 2026 4:39 PM IST
Bowenpally
X

Bowenpally: బోయిన్‌పల్లిలో ఎమ్మెల్యే శ్రీగణేష్ ఆకస్మిక తనిఖీ

Bowenpally: బోయిన్‌పల్లి మార్కెట్ నుండి అంబేద్కర్ నగర్ రోడ్‌లో కూరగాయల దుకాణాలతో రోజూ ట్రాఫిక్ స్తంభించిపోయి అత్యవసర సమయంలో అంబులెన్స్‌లు కూడా బస్తీలోకి వెళ్లలేని దుస్థితి నెలకొందని బస్తీ వాసులు కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై తక్షణమే స్పందించిన ఎమ్మెల్యే శ్రీగణేష్ బుధవారం ట్రాఫిక్, లా & ఆర్డర్ పోలీస్ అధికారులతో కలిసి స్పాట్‌కి వెళ్లి పరిస్థితిని పరిశీలించారు. బస్తీ వాసులు, దుకాణదారులతో నేరుగా మాట్లాడి సమస్యను క్షుణ్ణంగా తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే దుకాణదారులకు దుకాణాలన్నీ క్రమ పద్ధతిలోనే పెట్టుకోవాలని,రహదారిపై ట్రాఫిక్‌కు ఏమాత్రం అడ్డు పడొద్దని సూచించారు. అదేవిధంగా పోలీస్ అధికారులకు ఈ రోడ్‌లో వెంటనే CC కెమెరాలు ఏర్పాటు చేయాలని, దుకాణదారులకు, బస్తీ వాసులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూడాలని, అత్యవసర సేవలకు ఆటంకం లేకుండా ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించాలని ఆదేశించారు.

ప్రజల ప్రాణాల కంటే ఏదీ ఎక్కువ కాదని, అంబులెన్స్‌లు నిరాటంకంగా వెళ్లేలా చూడటం తమ ప్రథమ కర్తవ్యమని ఎమ్మెల్యే శ్రీగణేష్ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెంట ట్రాఫిక్ ఏసీపీ శంకర్ రాజు, సీఐలు తిరుపతి రాజు, శ్రీధర్ నాయక్, బస్తీ వాసులు, దుకాణదారులు పాల్గొన్నారు. బోయిన్‌పల్లి మార్కెట్ నుండి అంబేద్కర్ నగర్ రోడ్‌లో కూరగాయల దుకాణాలతో రోజూ ట్రాఫిక్ స్తంభించిపోయి అత్యవసర సమయంలో అంబులెన్స్‌లు కూడా బస్తీలోకి వెళ్లలేని దుస్థితి నెలకొందని బస్తీ వాసులు కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ దృష్టికి తీసుకువచ్చారు.

దీనిపై తక్షణమే స్పందించిన ఎమ్మెల్యే శ్రీగణేష్ బుధవారం ట్రాఫిక్, లా & ఆర్డర్ పోలీస్ అధికారులతో కలిసి స్పాట్‌కి వెళ్లి పరిస్థితిని పరిశీలించారు. బస్తీ వాసులు, దుకాణదారులతో నేరుగా మాట్లాడి సమస్యను క్షుణ్ణంగా తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దుకాణదారులకు దుకాణాలన్నీ క్రమ పద్ధతిలోనే పెట్టుకోవాలని, రహదారిపై ట్రాఫిక్‌కు ఏమాత్రం అడ్డు పడొద్దని సూచించారు.

అదేవిధంగా పోలీస్ అధికారులకు ఈ రోడ్‌లో వెంటనే CC కెమెరాలు ఏర్పాటు చేయాలని, దుకాణదారులకు, బస్తీ వాసులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూడాలని, అత్యవసర సేవలకు ఆటంకం లేకుండా ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించాలని ఆదేశించారు. ప్రజల ప్రాణాల కంటే ఏదీ ఎక్కువ కాదని, అంబులెన్స్‌లు నిరాటంకంగా వెళ్లేలా చూడటం తమ ప్రథమ కర్తవ్యమని ఎమ్మెల్యే శ్రీగణేష్ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెంట ట్రాఫిక్ ఏసీపీ శంకర్ రాజు, సీఐలు తిరుపతి రాజు, శ్రీధర్ నాయక్, బస్తీ వాసులు, దుకాణదారులు పాల్గొన్నారు.

Srikanth, Secunderabad

Srikanth, Secunderabad

Next Story